అక్కినేని నాగార్జున: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , గా → గా , తిధి → తిథి, ప్రధమ → ప్రథమ, using AWB
చి →‎సినిమా జీవితము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 25:
 
== సినిమా జీవితము ==
నాగార్జున మొదటి చిత్రం [[విక్రం]], మే 23, 1986లో విడుదల అయింది. ఈ చిత్రం [[హిందీ]] చిత్రం [[హీరో]]కి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన [[మజ్ను]] సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా [[కలెక్టరుగారి అబ్బాయి]] చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన [[ఆఖరి పోరాటం]] సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం [[గీతాంజలి]] భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు [[రాంగోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]], ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని [[హిందీ]]లో [[శివ]] అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. [[ప్రెసిడెంట్ గారి పెళ్లాం]], [[హలో బ్రదర్]] వంటి చిత్రాలు ఈయనకు ''మాస్ హీరో'' అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత [[కృష్ణ వంశీ]] దర్శకత్వములో విడుదలైన ''[[నిన్నే పెళ్లాడుతా]]'' భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత [[అన్నమయ్య (సినిమా)|అన్నమయ్య]] చిత్రములో వాగ్గేయకారుడు [[అన్నమయ్య]] పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినదినడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
 
[[2006]]లో నాగార్జున తన తాజా చిత్రము ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీ రామదాసు]]''లో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.