ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

చి 103.46.235.216 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప...
పంక్తి 116:
|}
 
==[[ఇతరాలు]]==
* "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి'
* '''ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం''' తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)