ధర్మపత్ని (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కథాంశం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 31:
రాధకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి చనిపోతుంది. పోతూ పోతూ రాధని శ్రీదేవి అనే దేవదాసి చేతుల్లో పెడుతుంది. తాను దేవదాసి పని మానేసి మంచి జీవితం గడుపుతానని రాధ తల్లికి మాటిస్తుంది శ్రీదేవి. గృహిణికి ఉండాల్సిన లక్షణాల గురించి చిన్నపిల్ల రాధకు బోధిస్తుంది శ్రీదేవి. స్కూల్లో రాధ, మోహన్ స్నేహితులవుతారు. వారితో పాటు ఆ స్నేహం పెరిగి ప్రణయంగా మారుతుంది. ఆమెని గుడికి తీసుకెళ్లి దేవును ముందు రాధను తన 'ధర్మపత్ని'గా స్వీకరిస్తాడు మోహన్.
 
ఓ దేవదాసి కూతురితో తన కొడుకు తిరుగుతున్నాడనే సంగతి విలన్ ఆనందరావు ద్వారా మోహన్ తండ్రికి తెలుస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఉమ అనే అమ్మాయిని పెళ్లిపెళ్ళి చేసుకోవాల్సిందిగా కొడుకు మీద ఆయన ఒత్తిడి తెస్తాడు. పెళ్లయ్యాక తన పట్ల మోహన్ అనాసక్తిగా ఉండటానికి రాధ పట్ల అతనికున్న ప్రేమేనని తెలుసుకున్న ఉమ అతన్ని విడిచి వెళ్తుంది. ఆనందరావు ట్రాప్ నుంచి ఉమను కాపాడుతుంది అతని వల్ల అప్పటికే మోసపోయిన లీల.
 
లీలను హత్యచేసి ఆ నేరం మోహన్ మీద పడేట్లు చేస్తాడు ఆనందరావు. మోహన్‌ని రక్షించడానికి అతను నిరపరాధి అని చెప్పే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పిన ఆనందరావు వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకుంటుంది రాధ. చివరకు నిజం బయటపడి మోహన్ జైలునుంచి విడుదలవుతాడు. అతని తల్లిదండ్రులు రాధను చేరదీస్తారు. తన తప్పు తెలుసుకుని తిరిగి మోహన్ వద్దకు చేరుకుంటుంది ఉమ.