నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు/సంప్రదింపు లంకెలు: clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేస్తు → పనిచేస్తు, స్థాయుల → స్థాయిల, → , , → ,, ) → ) using AWB
పంక్తి 39:
 
== జీవితం==
నండూరి రామ్మోహనరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో [[1927]] , [[ఏప్రిల్ 24]] న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లోస్థాయిల్లో "[[ఆంధ్రపత్రిక]]"లో పనిచేశారు. 1960-1994 దాకా [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
 
ఆయన జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు.
పంక్తి 51:
 
==హేమాహేమీలతో అనుబంధం==
నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పని చేస్తున్నపుడుపనిచేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు… అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. సాహితీ వేత్తలు ఆరుద్ర, శ్రీశ్రీలతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకుడు కె.శ్రీనివాస్‌లతో నండూరికి అనుబంధం ఉంది.
 
==రచనలు==
పంక్తి 59:
* విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన
* అనుపల్లవి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
* చిరంజీవులు (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం) <ref>{{cite book|last1=రామమోహనరావు|first1=నండూరి|title=చిరంజీవులు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=chiran%27jiivulu&author1=nan%27d%27uuri%20raamamoohanaraavu&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1987%20&language1=telugu&pages=246&barcode=2990100061528&author2=&identifier1=&publisher1=Navodaya%20Publishers,%20Vijayawada&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-07&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0061/533}}</ref>
* వ్యాసావళి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
* అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి)
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు