స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రభావాలు, ఫలితాలు: ఖాళీ విభాగాలు తొలగింపు
పంక్తి 1:
{{మూస:18+ కి మాత్రమే}}
[[File:Gay Couple Savv and Pueppi 02.jpg|thumb|right|స్వలింగ సంపర్కం]]
[[File:Gustave Courbet Sleep- Le Sommeil (1866), Paris, Petit Palais.jpg|thumb|right|కోర్బెట్ "[[నిద్ర]]" చిత్రపటంలో ఇద్దరు స్త్రీలు]]
స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధియో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని American Psychological Association, American Psychiatric Association, American Academy of Pediatrics మొదలగు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల దీనిని Indian Psychiatric Society కూడా ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసీ 377 సెక్షన్) ప్రకారం '''స్వలింగ సంభోగం''' (Homosexual intercourse) నేరంగా పరిగణింపబడుతుంది. అయితే, ఢిల్లీ హైకోర్టు 2.7.2009న ఇద్దరు వయస్కుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే '''స్వలింగ [[సంభోగం]]'' నేరం కాదని, సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని అధికరణాలు 14, 15 మరియు 21ల ప్రకారం తప్పని తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ 9.7.2009న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కానీ, సుప్రీంకోర్టు 11.12.2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని, ఒకవేళ దానిలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే పార్లమెంటు చేయవచ్చని తీర్పు చెప్పింది.
స్వలింగ సంపర్క చట్టానికి 149 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ పాలకుడు లార్డ్‌ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సంబంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ సెక్షన్‌ ప్రకారం ‘ఎవరైనా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు.
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు