కాలీఫ్లవరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
పంక్తి 13:
'''కాలీఫ్లవరు''' (cauliflower) ని తెలుగులో '''కోసుకూర''' అనీ, '''మట్టకోసు''' అనీ అంటారు. కాలీఫ్లవరు, [[బ్రొక్కొలి]] (broccoli) రెండూ ''[[బ్రాసికేసి]]'' (Brassicaceae) కుటుంబం (family) [[మొక్క]]ల నుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు [[పువ్వు]]లు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ్లవర్ ని ''బ్రసికా ఒలెరాసియా'' (Brassica oleracea) అంటారు. కాలీఫ్లవరు ఏటేటా పెరిగే మొక్క (annual). [[విత్తనాలు]] వేసి పెంచుతారు. తెల్లగా ఉన్న పువ్వు భాగాన్నే తింటారు; కాండాన్నీ, చుట్టూ ఉన్న ఆకుపచ్చని రెమ్మలనీ తినరు. పోషక పదార్ధాలు దండిగా ఉన్న కూరగాయ ఇది. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, [[ఊరుగాయ]] రూపంలోనూ తింటారు. [[కేబేజీ]], కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే.
 
కాలీఫ్లవరు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని సంకర జాతి పువ్వులు నారింజ రంగు లోనూ, కొన్ని బచ్చలిపండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ రంగు ఫువ్వులలో తెల్ల వాటిలో కంటెకంటే పోషక పదార్ధాలు 25 శాతం ఎక్కువ ఉన్నాయిట. ''ఆంథోసయనిన్‌'' (anthocyanin) అనే రసాయనం బచ్చలి రంగు కాలీఫ్లవరుకీ, ఎర్ర కేబేజీకీ, ఎర్ర ద్రాక్ష సారా ఆ రంగుని ఇస్తుంది. ఈ రసాయనం [[ఏంటీఆక్సిడెంటు]] (antioxident) కోవకి చెందటం వలన ఇది శరీరానికి మంచి చేస్తుందని [[:వర్గం:శాస్త్రవేత్తలు|శాస్త్రవేత్తలు]] నమ్ముతున్నారు.
 
కాలీఫ్లవరులో [[కర్బనోదకాలు]] (carbohydrates) లేదా [[పిండి పదార్ధాలు]] (starches) తక్కువ కనుక [[బంగాళాదుంప]] తినటానికి వీలులేని సమయాలలో దాని స్థానే దీనిని తినవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కాలీఫ్లవరు" నుండి వెలికితీశారు