సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
===తొలిమాట===
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి, ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథలసంకలనం ఈపుస్తకము.తెలుగు కథాసాహిత్యానికి దాదాపు వందేళ్లచరిత్ర వున్నది. పలుతెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ, ప్రచురిస్తున్నాయి.అయినప్పటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది. [[వారపత్రిక]] లలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే అరవైదశకంలో ప్రముఖకథారచయితల కథలను ప్రచురణకర్తలు సంకలానాలుగా అచ్చువేశారు. ఆతరువాత వచ్చిన ప్రేమ, సైంటిఫిక్, క్షుద్రశక్తులు, థ్రిల్లరు, సస్పెన్సు నవలల ప్రచురణ ప్రభంజనంలో కథలపుస్తకాల ప్రచురణ కొద్దిగా మందగించినమాట నిజం.అయితే ఈమధ్యకాలంలో పాఠకుల పఠనాభిరుచిలో మార్పువచ్చినది.నిజాల్నిదాచి,అవాస్తవలోకాన్నిరంగుటద్దాలలో చూపించి, పాఠకులను అవాస్తవభ్రమల ప్రపంచంలో విహరింపచేసే పైరకపు నవలల పైఆసక్తితగ్గి,ఇప్పుడిప్పుడే జీవితంలోనిసంఘటనలను,వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ,చుట్టూజరుగుతున్న ఘోరాలను,అన్యాయలను,అక్రమాలను,కఠోర జీవిత,జీవన నగ్నసత్యాలను, ఎత్తిచూపిస్తూ కళ్ళకుకట్టేటట్లు రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగా చదువుచున్నారు.క్రమేపి కథాసంకలనపుస్తకాలకు ఆదరణపెరుగుతున్నది. ఈమార్పు హర్షించతగినదే.
 
సీమ కథలు పుస్తకాన్ని [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]], [[హైదరాబాదు]] వారు మొదటిసారిగా[[1992]]లో ప్రచురించారు. మలిముద్రణ[[1994]] లో జరిగినది. ఆతువాత మూడవముద్రణ [[2010]] లో. పుస్తకంలోని కథల సంకలనం: [[రాయలసీమ]] రచయిత'సింగమనేని నారయణ'. ఇందులో మొత్తం పద్దెనిమిదికథలున్నాయి, పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,వాస్తవ గ్రామీణుల యధార్దవ్యధలను,వెతలను పాఠకుల ముందించిన,బతుకు అనుభవాలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకంలోని కథలన్ని అంతకుముందే వివిధపత్రికలో అచ్చయిన కథలు. తెలుగురాష్ట్రంలో మిగతాప్రాంతాలకన్న ఒకప్రత్యేకమైన ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక జీవనజీవితమున్న గడ్డ-సీమగడ్డ. సీమప్రాంత గ్రామీణజనజీవనం వ్యవసాయంతో ముడివడివున్నది.భారతదేశంలో అతితక్కువ వర్షపాతమున్నప్రాంతంగా నమోదయినప్రాంతం'రాయలసీమ'గడ్డ. అందులో [[అనంతపురంజిల్లా]], దేశంలోనే తీవ్రవర్షాభావంవున్న రెండోజిల్లా.ఇక్కడ ప్రాణాలు నిలవలన్నా,పోవాలన్నా'నీళ్ళే'కారణమంటే,నీళ్ళు పుస్కలంగాదొరికే రాష్ట్రంలోని ఇతరప్రాంతాలవారు విస్తుపోతారు.
అట్టిరాయలసీమ చిద్రమైన పల్లెజనుల బతుకులను పాఠకులముందుంచిన పుస్తకం-సీమ కథలు.
 
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు