ఆరాధ్యుల కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నతనం నుండి తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగిన కోటేశ్వరరావుకు నాటకాలపై అభిమానం పెరిగింది. విద్యార్థి దశలోనే పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు. 1985లో కళాశాల విద్య పూర్తి చేసి, పూర్తిస్థాయి రంగస్థల నటునిగా స్థిరపడ్డారు. వీరి నటనకు పేక్షకుల నుండి ప్రశంసలు లభించడమేకాకుండా, తెనాలిలో గల ముఖ్యమైన నటులలో ఒకరుగా గుర్తింపబడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలోనేకాక మద్రాసు కళాసాగర్ లో, బొంబాయి ఆంధ్ర మహాసభలో మరియు ఒరిస్సాలో నాటకాలు ప్రదర్శించి, పేరు ప్రతిష్టలు సంపాదించారు. 1994లో మద్రాసులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో [[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|శ్రీకృష్ణ తులాభారం]] నాటకం ప్రదర్శించి, ప్రశంసలు పొందారు.
 
== సినిమా రంగం ==
1988లో సినిమారంగానికి వెళ్లి [[అగ్నిసాక్షి]], [[ఇంద్రజిత్తు]], అమ్మకానికో అబ్బాయి మొదలైన సినిమాలలో నటించారు. టి.వి, రేడియోలలో కూడా పాల్గొన్నారు.
 
== నటించిన పాత్రలు ==