శోభు యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత [[దేవినేని ప్రసాద్]] తో కలిసి ఈ సంస్థ ద్వారా [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[వేదం (సినిమా)|వేదం]], [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.<ref name="idlebrain.com">{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/chitchat-shobuyarlagadda.html|title=Shobu Yarlagadda chitchat - Telugu cinema producer|work=idlebrain.com}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
శోభు కృష్ణా జిల్లా, గుడివాడ లో 1971, మార్చి 19 న జన్మించాడు. 1992 లో [[ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుండి [[సివిల్ ఇంజనీరింగ్]] లో పట్టభద్రుడయ్యాడు. 1995 లో అమెరికాలో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నాడు. ఒకటిన్నర సంవత్సరం పాటు ''గ్రేటర్ లాస్ ఏంజిలెస్ ఏరియా ఫర్ కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డు'' సంస్థలో ఎయిర్ రిసోర్స్ ఇంజనీరుగా పనిచేశాడు. ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2001 లో ఆర్కా మీడియా వర్క్స్ అనే సంస్థను స్థాపించాడు.
 
== కెరీర్ ==
2001 లో ఆర్కా మీడియా వర్క్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బంగ్లా, మరాఠీ భాషలో టీవీ కార్యక్రమాలు రూపొందించే సంస్థను స్థాపించాడు. మార్నింగ్ రాగ, అనగనగా ఓ ధీరుడు సినిమాలకు లైన్ ప్రొడ్యూసరుగా, బాబీ, పాండురంగడు సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.<ref>{{cite web|url=http://telugu.zustcinema.com/2011/11/shobu-yarlagadda-now-producer-of.html|title=Shobu Yarlagadda now producer of Prabhas-Rajamouli's film|author=Karnik for ZC|work=zustcinema.com}}</ref>
 
== ఆదాయపు పన్ను శాఖ దాడులు ==
"https://te.wikipedia.org/wiki/శోభు_యార్లగడ్డ" నుండి వెలికితీశారు