"ప్రియదర్శన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
'''ప్రియదర్శన్ సోమన్ నాయర్''' ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా హిందీలో సినిమాలు తీశాడు.
 
2007 లో ప్రియదర్శన్ రూపొందించిన తమిళ సినిమా ''[[కాంచీవరం]]'' జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012 లో [[పద్మశ్రీ పురస్కారం]]తో గౌరవించింది.<ref name="The Times of India">{{cite news|author=The Times|date= 26 January 2012|url=http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Anup-Jalota-Priyadarshan-to-receive-Padma-Shri/articleshow/11628133.cms|title=Anup Jalota, Priyadarshan to receive Padma Shri|newspaper=[[The Times of India]]|publisher=indiatimes.com|accessdate=13 August 2012}}</ref>
 
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రియదర్శన్ కేరళ లోని తిరువనంతపురంలో సోమన్ నాయర్, రాజమ్మ దంపతులకు జనవరి 30, 1957న జన్మించాడు. గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చదువుకున్నాడు. త్రివేండ్రం విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఎం. ఏ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన తండ్రి ఓ కళాశాలలో లైబ్రేరియన్ కావడంతో ప్రియదర్శన్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడు. కళాశాలలో చదివే రోజుల్లో ఆకాశవాణి కోసం చిన్న నాటకాలు, రూపకాలు రాసి పంపేవాడు. మలయాళ దర్శకుడు పి. వేణు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవాడు. [[మోహన్ లాల్]], [[శ్రీ కుమార్]] మొదలైన వారు స్నేహితులుగా ఉండేవారు. అప్పుడే మోహన్ లాల్ సినిమాల్లో ప్రవేశిస్తున్నాడు. స్నేహితులతో కలిసి సినిమాల్లో అవకాశం కోసం చెన్నై వెళ్ళాడు. మోహన్ లాల్ సహాయంతో ప్రియదర్శన్ కొన్ని సినిమాలకు రచనలో సహాయం అందించాడు. వాటిలో కొన్ని విజయం సాధించాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కేరళకు రావలసి వచ్చింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/trivandrum-days/article780844.ece|title=Trivandrum days|work=The Hindu}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2023050" నుండి వెలికితీశారు