మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== బాల్యం మరియు నేపథ్యం==
బాలమురళీకృష్ణ 1930, జులై 6న మద్రాసు రాష్ట్రం లోని, [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా [[శంకరగుప్తం]]లో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం [[సఖినేటిపల్లి]] మండలం [[అంతర్వేదిపాలెం]]. కొచ్చర్లకోట రామరాజు ఆయన మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థంకు చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి ఆయన కనపడకుండా పోవడంతో మళ్ళీ [[పెద్దకల్లేపల్లి]]కి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరాడు. ఆయన తదనంతరం ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు. <ref name="బి. ఎం. సుందరం వ్యాసం">{{cite web|last1=బి. ఎం.|first1=సుందరం|title=A prodigy and a genius|url=https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|website=dhvaniohio.org|publisher=dhvaniohio.org|accessdate=23 November 2016}}</ref> ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు [[వేణువు]], [[వయోలిన్]], [[వీణ]] విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి [[పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం"/>
 
1938 జులై లో ఎనిమిదేళ్ళ ప్రాయంలో [[విజయవాడ]]<nowiki/>లో తన గురువు [[పారుపల్లి రామకృష్ణయ్య]], ఆయన గురువు [[సుసర్ల దక్షిణామూర్తి]] పేరున ఏర్పాటు చేసిన ''సద్గురు ఆరాధనోత్సవాలు'' సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=పలుకే బంగారమాయెనా!|url=http://www.sakshi.com/news/family/the-last-interview-given-by-balamuralikrishna-424940?pfrom=home-top-story|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=23 November 2016}}</ref><ref name="ది హిందూ దినపత్రికలో కడివెళ్ళ రాం వ్యాసం">{{cite web|last1=కడివెళ్ళ|first1=రామ్|title=Torchbearer of innovation|url=http://www.thehindu.com/features/friday-review/music/on-mangalampalli-balamuralikrishna/article7481511.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=23 November 2016}}</ref> ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన ప్రముఖ [[హరికథ]] విద్వాంసుడు [[ముసునూరి సత్యనారాయణ]] అతని పేరు మురళీకృష్ణ కు ముందు ''బాల'' అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ"/>