అవంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పురాణాల ప్రకారం అవంతీ సామ్రాజ్యాన్ని నాగ వంశం దగ్గర నుంచి చేజిక్కించుకుని పరిపాలించారు. మొదట్లో మాహిష్మతి నుంచి పరిపాలించారు. తరువాత ఈ జనపదాన్ని రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగానికి మాహిష్మతి, మరో విభాగానికి ఉజ్జయినిని రాజధానిగా చేసినట్లు తెలుస్తోంది. హైహయులు నిజానికి వితిహోత్ర, భోజ, అవంతి, తుండికేరులు, మరియు శార్యతులు అనే ఐదు జాతుల సంగమం. తర్వాత వీటిలో బలమైన జాతియైన వితిహోత్రుల పేరే ఈ వంశానికి స్థిరపడింది. ఉజ్జయినికి చివరి వితిహోత్ర పాలకుడైన రిపుంజయుడు తన మంత్రి పులిక చేతిలో ఓడిపోయి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పులిక తన కుమారుడైన ప్రద్యోతుడిని సింహాసనంపై కూర్చుండబెట్టాడు.<ref>Raizada, Ajit (1992). ''Ujjayini'' (in Hindi), Bhopal: Directorate of Archaeology & Museums, Government of Madhya Pradesh, p.21</ref><ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.130-1</ref> కొన్ని గ్రంథాల్లో ఉజ్జయిని నగరాన్నే అవంతి సామ్రాజ్యానికి రాజధానికి సూచించారు.<ref>{{cite book|title=India through the ages|last=Gopal|first=Madan|year= 1990| page= 74|editor=K.S. Gautam|publisher=Publication Division, Ministry of Information and Broadcasting, Government of India}}</ref>
 
బౌద్ధ గ్రంథం [[దిఘ నికాయ]] లోని మహాగోవిందసుత్తాంత లో అవంతి రాజు వెస్సభు (విశ్వభు) గురించి అతని రాజధాని మహిస్సతి (మహిష్మతి) గురించి ప్రస్తావించారు. బహుశా అతను వితిహోత్ర పరిపాలకుడు అయ్యుండవచ్చు.<ref name="bhattacharyya">{{cite book|last=Bhattacharyya|first=P. K. |title=Historical Geography of Madhya Pradesh from Early Records|year=1977|publisher=Motilal Banarsidass|location=Delhi|isbn=|pages=118–9|url=https://books.google.com/books?id=njYpsvmr2dsC&pg=PA118&dq=Dighanikaya+Mahissati&hl=en&ei=53jqTL-TMoqEvgOjnLzCCA&sa=X&oi=book_result&ct=result&resnum=9&ved=0CEwQ6AEwCA#v=onepage&q=Dighanikaya%20Mahissati&f=false}}</ref>
 
==ప్రద్యోత వంశం==
ప్రద్యోతుడు గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. ఇతనికి చంద్రప్రద్యోత మహాసేనుడని కూడా పేరు. ప్రద్యోతుడు వత్స దేశ రాజైన ఉదయనుడిని ఓడించి తన కుమార్తె వాసవదత్తను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. ''మహావగ్గ'' ఇతనిని ఓ క్రూరుడిగా వర్ణించింది. ''మజ్జిమ నికాయ'' ప్రకారం మగధ సాంజ్రాజ్యాధీశుడైన అజాత శత్రువు ప్రద్యోతుడి నుంచి రక్షించుకోవడం కోసం తన రాజగ్రహాన్ని పటిష్టపరిచినట్లు తెలుస్తుంది. ప్రద్యోతుడు తక్షశిల రాజైన పుష్కరశారిన్ మీద కూడా దండెత్తాడు.<ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.179-81</ref> ప్రద్యోతుడి ప్రధాన భార్య గోపాలమాత బౌద్ధ సన్యాసి యైన మహా కాత్యాయనుడికి శిష్యురాలిగా ఉండేది. ఆమె ఉజ్జయినిలో ఒక స్థూపాన్ని కూడా నిర్మించింది.
 
ప్రద్యోతుడికి గోపాలుడు, పాలకుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇందులో పాలకుడు ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. జైనుల రచనల ప్రకారం పాలకుడు మహావీరుడు నిర్యాణం పొందిన రోజే అతను గద్దెనెక్కాడు. కథా సరిత్సాగరం మరియు అవశ్యక కథానక ప్రకారం వత్స సామ్రాజ్యం పాలకుడి రాజయ్యేటప్పటికి అవంతిలో భాగంగా ఉంది. ఆ రాజ కుటుంబీకుడు కోశాంబికి గవర్నరుగా ఉండేవాడు. మృచ్చకటికంలో పాలకుడు ప్రజాకంటకుడుగా ఉండడం వల్ల విప్లవం చెలరేగి అతన్ని దింపేశారనీ ఉంది. ఈ విప్లవం తర్వాత ఉజ్జయిని రాజ్యానికి ఆర్యకుడు రాజయ్యాడు. పురాణాల ప్రకారం ఆర్యకుడి తర్వాత నాడీవర్ధనులు, వర్తివర్ధనులు ఆర్యకుడి తర్వాత రాజ్యమేలారు.కానీ ఈ పేర్లు అవంతీవర్ధనుడు అనే పేరుకు రూపాంతరాలు అయి ఉండవచ్చు. కథా సరిత్సాగరం ప్రకారం అవంతీ వర్ధనుడు పాలకుని కొడుకు. లేదా నేపాలీ బృహత్కథ ప్రకారం గోపాలుని కొడుకు. ఇతనిని మగథ రాజైన శిశునాగుడు ఓడించాడు.<ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.192-5</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అవంతి" నుండి వెలికితీశారు