కాంచీవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| music = ఎం. జి. శ్రీకుమార్
}}
'''కాంచీవరం''' 2008లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం. ఇందులో [[ప్రకాష్ రాజ్]], [[శ్రియా రెడ్డి]] ప్రధాన పాత్రధారులు. ఎం. జి. శ్రీకుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కాంచీపురంలో ఉన్న నేత కార్మికుల దయనీయ స్థితిని ఈ చిత్రంలో చూపించారు. కాంచీపురంలో సహకార చేనేత ఉద్యమం ఎందుకు ప్రారంభమైందో చెబుతూ సినిమా ముగిస్తారు. సినిమా కాంచీపురం నేపథ్యంలో తీసినా ప్రధానంగా ఈ సినిమాను మైసూరులో చిత్రీకరించారు.
 
2007 లో ఈ సినిమా సెన్సారు పూర్తి చేసుకుంది. దీనికి యూ సర్టిఫికెట్ లభించింది. 2008 లో 33వ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా సెప్టెంబరు 12, 2008 న విడుదల చేశారు.<ref>http://tiff08.ca/filmsandschedules/films/kanchivaram</ref> పిట్స్ బర్గ్ లో జరిగిన సిల్క్ స్క్రీన్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. తర్వాత ఈ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా, ప్రకాష్ రాజ్ కు ఉత్తమ నటుడిగా 55వ జాతీయ చలనచిత్రోత్సవాల సందర్భంగా అవార్డులు ప్రకటించారు. ప్రియదర్శన్ కు ఉత్తమ దర్శకుడిగా జెనిత్ ఆసియా పురస్కారాన్ని ప్రధానం చేశారు.
 
ఈ సినిమాను మొదట్లో మోహన్ లాల్ కథానాయకుడిగా, ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా మలయాళంలో తీయాలనుకున్నారు.<ref>http://www.rediff.com/movies/2001/oct/17priya.htm</ref> కానీ మోహన్ లాల్ డేట్లు కుదరక పోవడం వల్ల అది కుదరలేదు.<ref>http://www.indiaglitz.com/mohanlal-was-supposed-to-do-kanchivaram-priyan-malayalam-news-49791</ref>
 
== కథ ==
Line 27 ⟶ 31:
 
కథ మళ్లీ ప్రస్తుతానికి వస్తుంది. అతని కూతురు పొరపాటున కాలు జారి బావిలో పడిపోయి పక్షవాతానికి గురై ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లి జమీందారు కొత్త కారును చూడ్డానికి వెళ్ళిన జనాల తొక్కిసలాటలో మరణించి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. దాంతో వేంగడం తన చెల్లెల్ని పిలిచి ఆ అమ్మాయిని తన ఇంట్లో ఉంచమంటాడు. కానే ఆమె ఓ దొంగ కూతురు తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని ఖరాకండీగా చెబుతుంది. వేంగడం ఏమి చేయాలో పాలుపోక కన్నకూతురికే విషమిచ్చి చనిపోయేలా చేస్తాడు. కూతురు శవాన్ని ఇంటి ముందు ఉంచి లోపలికి వెళ్ళి తాను సగంలో ఆపేసిన చీరను ఆమెకు పూర్తిగా కప్పాలని అన్ని విధాల ప్రయత్నిస్తాడు. పోలీసులు వచ్చి ఇంక సమయమైందని చెప్పగానే వెర్రి చూపులు చుస్తూ పిచ్చి నవ్వు నవ్వుతాడు.
 
== తారాగణం ==
* వేంగడం గా ప్రకాష్ రాజ్
* అన్నం గా శ్రియా రెడ్డి
* తామరై గా షమ్ము
* రంగన్ గా విమల్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచీవరం" నుండి వెలికితీశారు