దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత డా.బి.ఆర్ . [[అంబేద్కర్]] రచనలు, ప్రసంగాల ప్రభావం వల్ల తన ఆలోచన మరింత పదునుదేరిందని పేర్కొన్నారు.<ref> దార్ల ఆత్మకథ ‘నెమలికన్నులు’</ref> అంతకు ముందు తమ స్వగ్రామంలో అంబేద్కర్ జయంతి, వర్థంతులు జరిపినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాతనే దళితవాదం పట్ల నిజమైన అవగాహన ఏర్పడిందని చెప్పుకున్నారు. అయితే, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దళిత సంఘాల్లో మాదిగ విద్యార్థులను దూరం పెట్టడాన్ని గమనించడంతో విద్యార్థులు ‘దళిత విద్యార్థి సంఘం’ (డి.ఎస్.యు) ఏర్పరిచారు. దీన్ని ‘దండోరా విద్యార్థి సంఘం’ అని పరోక్షంగా పిలిచేవారు. డి.ఎస్.యుతో పాటుగానే ‘మాదిగ సాహిత్యవేదిక’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘం, సాహిత్యవేదిక వ్యవస్థాపకుల్లో వేంకటేశ్వరరావు కూడా భాగస్వామిగా ఉన్నారు. మాదిగసాహిత్యవేదిక ఆధ్వర్యంలో వెలువడిన‘‘మాదిగచైతన్యం’’ కవితాసంకలనంతో తెలుగుసాహిత్య చరిత్రలో ‘మాదిగసాహిత్యం’ అనే ధోరణి ఒకటి ప్రారంభమైంది. దీనికి ప్రధాన సంపాదకుడు నాగప్పగారి సుందర్రాజు. సంపాదకుడుగా దార్ల వేంకటేశ్వరరావు ఉన్నారు. ఈయనతో పాటు మరికొంతమంది సంపాదకవర్గసభ్యులుగా ఉన్నప్పటికీ ఆ కవితాసంకలనం సంపాదక బాధ్యతలన్నీ వేంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ పుస్తకాన్ని తీవ్రంగా విమర్శించిన సమీక్షకుడికి సంపాదకుడుగా తన వాదాన్ని వినిపిస్తూ వేంకటేశ్వరరావు ఒక ప్రతివిమర్శ వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత దళిత సాహిత్యం రాస్తున్నప్పటికీ, తెలుగులో మాదిగ సాహిత్య దృక్పథంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈయన రచనల్లో మార్క్సిజం పట్ల సానుభూతి కనిపిస్తున్నా దేశీయ అవసరాలు, భావజాలవ్యాప్తిలో భాగంగా దళిత, బహుజన సాహిత్యాన్నే విస్తృతంగా రాస్తున్నారు. అస్ఫృశ్యతను ప్రధాన కారణంగా చూసినప్పుడు, అది పాకీవాళ్ళు, మాదిగల పట్లనే ఎక్కువగా కనిపిస్తుంది. పాకీవాళ్ళు (రెల్లి) కూడా జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ నివేదిక ప్రకారం పాకీవాళ్ళు (రెల్లి) కూడా మాదిగ ఉపకుల జాబితాకే చెందుతారు. అందువల్ల దళితులంటేనే మాదిగలుగా గుర్తించాలనేది దార్ల వెంకటేశ్వరరావువాదన. దళితుల గురించి దళితులైనా, దళితేతరులైనా ఎవరు రాసినా దళితుల్లోని ‘అస్ఫృశ్యత’నే ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కనుక, మాదగసాహిత్యమే దళిత సాహిత్యానికి మూలమని, మాదిగ సాహిత్యం దళితసాహిత్యం నుండి ఆవిర్భవించినట్లు చెప్పకూడదనీ, దళితసాహిత్యమే మాదిగ సాహిత్యం నుండి పుట్టుకొచ్చిందని దార్ల వెంకటేశ్వరరావు ప్రతిపాదిస్తారు.<ref>[http://www.suryaa.com/showaksharam.asp?ContentId=9670 మాదిగసాహిత్యం నుండే దళితసాహిత్యం... సూర్యదినపత్రిక, అక్షరం సాహిత్యానుబంధం, 16-2-2009]</ref>
==నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన==
సంప్రదాయ అవిచ్ఛిన్నతతో పాటు, ఆధునిక భావజాలాల్ని చర్చించే అవకాశం కూడా విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో ఉంటుంది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC), మానవ వనరుల శాఖల వారు కూడా ఎప్పటికప్పుడు నూతనావిష్కరణలకు అవకాశాలు పురిగొల్పేలా పాఠ్యప్రణాళికలను రూపొందిస్తుంది. ఇటీవల ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) ప్రకటించింది.<ref>[http://www.ugc.ac.in/pdfnews/9555132_Guidelines.pdf www.ugc.ac.in Guidelines] </ref> ఈ రకమైన ఆలోచనతోనే డా.దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కొన్ని నూతన పాఠ్య ప్రణాళికలకు రూపకల్పన చేశారు. వీటిలో ముఖ్యమైన కొన్ని కోర్సులలో దళితసాహిత్యం, ప్రవాసాంధ్రసాహిత్యం-పరిచయం, పరిశోథన గ్రంథ రచనా నైపుణ్యాలు మొదలైనవన్నీ ఎం.ఏ.స్థాయిలో ప్రవేశపెట్టారు.
 
==పురస్కారాలు==
[[భారతీయ సాహిత్య పరిషత్]] (రాజమండ్రి శాఖ) వారు 1996లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు. [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] వారు డిగ్రీ స్థాయిలో స్పెషల్ తెలుగు చదివి విశ్వవిద్యాలయం స్థాయిలో సర్వప్రథముడిగా నిలిచిన వారికిచ్చే ‘[[కళాప్రపూర్ణ]]’ [[జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి]] (1995), [[కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి]] (1995)లను అందుకున్నారు. దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి [[డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం]] (2007) పొందారు <ref> https://vrdarla.blogspot.in/2007/12/1.html</ref> ఈవిషయాన్ని పలు పత్రికలు, అంతర్జాల పత్రికలు విశేషంగా వార్తాంశాలను రాశారు. <ref>http://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html</ref> ఈయన తెలుగు సాహిత్య విమర్శకు చేస్తున్న కృషిని గుర్తించిన మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే [[ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం]] (2012) తో త్యాగరాయగానసభ, (5-3-2012)లో సత్కరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చేసిన కృషికి గుర్తింపుగా 2012 సంవత్సరానికి గాను [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారి [[కీర్తి పురస్కారం]]తో సత్కరించారు.<ref>[http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/</ref> 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో [[మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం]]తో సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 1 అక్టోబరు 2016 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.<ref>[https://www.youtube.com/results?search_query=university+of+hyderabad+18th+convocation</ref> ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేస్తారు. యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016)తో 6 నవంబరు 2016 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు.<ref>[http://epaper.eenadu.net/index.php?rt=index/index# ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు]</ref>