Darlamanjusri
దార్ల అబ్బాయి
మార్చుదార్ల అబ్బాయి | |
---|---|
జననం | లంకయ్య సెప్టెంబరు , 1937 చెయ్యేరు అగ్రహారం(ఆంధ్రప్రదేశ్) |
మరణం | మార్చి 30, 2009 |
మరణ కారణం | సహజమరణం |
ఇతర పేర్లు | అబ్బాయి |
వృత్తి | సంఘసంస్కర్త |
జీతం | వ్యవసాయం |
భార్య / భర్త | పెదనాగమ్మ |
పిల్లలు | ఐదుగురు |
తండ్రి | వీరాస్వామి |
తల్లి | మరిడమ్మ |
జీవిత విశేషాలు
మార్చుప్రముఖ సంఘసంస్కర్త కీ.శే. శ్రీ దార్ల అబ్బాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో జన్మించారు. ఈయన అసలు పేరు ‘లంకయ్య’ అయినప్పటికీ ఊరులో వాళ్ళంతా ‘దార్ల అబ్బాయి’ అని పిలిచేవారు. ఊరందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. అందువల్ల ఈయనకు ‘అబ్బాయి’ అనే పేరే స్థిరపడిపోయింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించేనాటికి పదేళ్ళప్రాయం. అంటే ఈయన 1937 ప్రాంతంలో జన్మించారు.
సామాజిక సేవ
మార్చుదార్ల అబ్బాయి గారు నిరక్షరాస్యుడైనప్పటికీ, తన కుటుంబాన్ని ఉన్నత చదువులు చదివించి తన గ్రామానికి ఆదర్శంగా నిలిపారు. తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికీ ఆదర్శంగా నిలిచి, నిరక్షరాస్యత, అంటరానితనం నిర్మూలనకు విశేషంగా కృషిచేశారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించి, బాల్య వివాహాల్ని మానిపించారు. దళితులు మద్యపానం, పొగత్రాగడం వంటి వాటివల్ల సమాజంలో చిన్నచూపుచూస్తారని, వాటిని మాన్పించడానికి ఎంతగానో పాటుపడ్డారు. డా॥బి.ఆర్.అంబేద్కర్, డా॥బాబూ జగజ్జీవన్ రామ్ ల జయంతి, వర్ధంతుల సందర్భంగా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే ప్రసంగాలు చేసేవారు. దళితుల్ని సమైక్యపరచడానికీ, వారిని చైతన్యవంతుల్ని చేయడానికి ఈ కార్యక్రమాల్ని చక్కటి మార్గంగా మలుచుకునేవారు. దేవాలయ నిర్మాణాలకు తమ వంతు సహాయాన్ని చేసేవారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా పాఠశాలలు మూసేసారనీ, గాంధీజీ పిలుపుమేరకు ఆ చిన్న వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని ఆ ఊరి ప్రజలు చెప్తారు. ఆయన మార్చి 30, 2009 న పరమపదించారు.
సెంట్రల్ యూనివర్సిలో స్మారక బంగారు పతకం
మార్చుహైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి వారు ప్రముఖ సంఘసేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ శ్రీదార్ల అబ్బాయి (లంకయ్య) పేరుతో 2018-19 విద్యా సంవత్సరం నుండి ప్రతియేడాదీ ఒక బంగారు పతకాన్ని బహూకరిస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటిలో జరిగిన 79 వ అకడమిక్ కౌన్సిల్ లో ఆమోదించారు. ఈ విషయాన్ని 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం విడుదల చేసిన ప్రకటన ( గోల్డ్ మెడల్స్ జాబితా, సీరియల్ నెంబరు: 46)లో కూడా అధికారికంగా ప్రకటించారు. సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ., తెలుగు ( భారతీయ కావ్యశాస్త్రం, సాహిత్య విమర్శ రంగాల)లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులకు దార్ల అబ్బాయి పేరుమీద ఒక బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.<ref>https://vrdarla.blogspot.co.uk/2018/04/blog-post.html%7C ఈ బంగారు పతకాన్ని సాధారణంగా ప్రతియేడాదీ జరిగే విశ్వవిద్యాలయం వారి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథులుగా పాల్గొనే రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి/ రాష్ట్రగవర్నర్/ కేంద్ర మంత్రులు/ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు బహూకరిస్తారు.