దాగుడు మూతలు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
== చిత్రకథ ==
ఒక శ్రీమంతుడి (గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని దృఢనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సూర్యకాంతం) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె (శారద). ఒకామెకు కుమారుడు (పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు.
ఆ శ్రీమంతుడి ఫాక్టరీ ఎదురుగా ఒక క్యాంటీన్ నడుపూతూ ఉంటాడు ఒక యువకుడు (ఎన్.టి.రామారావు). మానవత్వమున్న అతడు, అనాథలను ఆశ్రయిస్తాడు. ఒక యువతి (బి.సరోజా దేవి) ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోడానికి అచ్చటకుఅక్కడికి వస్తుంది. ఆమెకు ఆ యువకుడు ఆశ్రయమిస్తాడు.
శ్రీమంతుడు వారసుడు ఆ క్యాంటీన్ ఓనర్ అని తెలుస్తుంది. అతని దశ మారిపోతుంది. బంధువుల నోట్లో వెలక్కాయ పడుతుంది. ఐతే, బంధువు కుమార్తె (శారద)ను యువకునికి (ఎన్.టి.ఆర్)కి ఇచ్చి పెళ్ళి చేసి ఆస్తి స్వంతం చేసుకోవాలని చూడడంతో వాళ్లతో విభేదాలు మొదలవుతాయి.యువకునితో పాటు యవతి కూడా శ్రీమంతుని ఇంటికి చేరుతుంది. ఈ లోగా శ్రీమంతుడు మరణిస్తాడు. ఆబంధువుల సంతానం (పద్మనాభం, శారద) పరస్పరం ప్రేమించుకుంటారు. యువకుడు ఆశ్రయమిచ్చిన యవతిని వదలాడానికి అంగీకరించడు. దానితో ఆ యువకునికి పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు. బంధువుల డబ్బు పిచ్చి వదిలించి వాళ్ల ఆట కట్టిస్తాడా యువకుడు.
 
సినీమాల్లోకి రావడం ముళ్ళపూడికి మొదట ఇష్టం లేకున్నా డి.బి.ఎన్ కు ఎదురు చెప్పలేక 'దాగుడు మూతలు' సినిమాకు కథ అల్లారు. పూర్తి స్క్రిప్టు తయారైతే కానీ షూటింగు షెడ్యూలు మొదలు పెట్టించే అలవాటులేని ముళ్ళపూడి, ఈ సినిమా కోసం గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించిన 'డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్' అనే అమెరికన్ స్క్రూ బాల్ కామెడీ సినిమాని ప్రేరణగా తీసుకొని కథ అల్లి సినేరియా సమకూర్చారు. ఈ హాలీవుడ్ సినిమాకి ఆధారమైన 'ఒపెరా హ్యాట్' అనే కథే దాగుడు మూతలు సినిమాకి కూడా మూలం. ఇంచుమించు దాగుడుమూతలు సినిమాకూడా అదే ధోరణిలో సాగుతుంది. దాగుడుమూతలు ముళ్ళపూడికి మొదటి సినిమానే అయినా, తొలుత విడుదలైన సినిమా మాత్రం 'రక్తసంబంధం' సినిమానే. ఇక దాగుడుమూతలు కథలోకి వెళ్తే, కోటీశ్వరుడు విశ్వసుందరరావు (గుమ్మడి) తన అభీష్టాన్ని వ్యతిరేకించి పెళ్ళిచేసుకున్నందుకు కొడుకును ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. తనకి మనిషి విలువేమిటో తెలిసేసరికి కొడుకూ, కోడలూ చనిపోతారు. అనాథగా మిగిలిన మనవడిని దారినపోయే దానయ్య చేరదీసి పెంచుతాడు. మనవడికోసం దేశమంతా గాలించినా అతని ఆచూకీ తెలియదు. కానీ తనవూళ్ళోనే, తన మిల్లు ప్రాంగణంలోనే చిన్న హోటలు నడుపుకునే సుందరయ్య తన మనవడేనని తెలుసుకోలేకపోతాడు జమీందారు. తనను పెంచిన దానయ్య బిడ్డల్ని సాకుతూ, పదిమందికీ సహాయపడుతూ హోటలు నడిపే సుందరయ్య జీవితంలోకి ఇష్టంలేని పెళ్ళినుంచి తప్పించుకుని పారిపోయివచ్చిన సుబ్బులు ([[బి.సరోజాదేవి]]) అనే చిన్నది ప్రవేశిస్తుంది. వారిద్దరి మనసులు కలిసి ప్రేమ చిగురిస్తుంది. జమీందారు ఆస్తి దక్కించుకోవాలని ఆయన అన్న అల్లుడు భూషణం (రమణారెడ్డి) తన కూతురు (శారద)తోనూ, జమీందారు తమ్ముని కోడలు సూరమ్మ ([[సూర్యకాంతం]]) తన కొడుకు ([[పద్మనాభం]])తోనూ ఆ బంగళాలో తిష్టవేసి పోటీలుపడి సేవల పేరుతో జమీందారుని హింసిస్తూ వుంటారు. సుబ్బులు జమీందారు దివాణంలో సేవలుచేసి నర్సుగా చేరి, జమీందారు అభిమానం చూరగొని, ఆ బంగళాలో సెక్రెటరీ స్థాయికి ఎదిగి ఆ ఇంట్లో అధికారం సంపాదించుకుంటుంది. ''నా కూతుర్ని నీ కోడలుగా చేసుకో: నీ కొడుకుని నేను జమీందారుకు దత్తు చేయిస్తాను'' అని భూషణం సూరమ్మతో చెప్పి, జమీందారును దత్తతకు ఒప్పిస్తాడు. జమీందారు వద్దవున్న ఫోటో, సుందరయ్యవద్ద వున్న అతని తల్లిదండ్రుల ఫోటో ఒక్కలాగే వుండడం గమనించిన సుబ్బులు సుందరయ్యే జమీందారు మనవడని గ్రహించి ఆయనకు సుందరయ్యను అప్పగిస్తుంది. సుందరయ్యను వారసుడిగా ప్రకటించి [[జమీందారు]] కన్నుమూస్తాడు. సుందరయ్య దానధర్మాలు చేస్తూవుండటం మింగుడుపడని భూషణం. తన కూతుర్ని పెళ్ళి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని ఒక దొంగ వీలునామా సృష్టించి వలపన్నుతాడు. సుందరయ్య భూషణం పన్నాగాన్ని పసికట్టి ఎత్తుకు పైఎత్తు వేసి శారదతో కూడపలుక్కొని పెళ్ళి చేసుకునేందుకు సరేనంటాడు. ఈ నాటకం తెలియని సుబ్బులు సుందర య్యను అపార్ధం చేసుకొని వెళ్ళిపోతుంది. బంగాళాకు వచ్చిన సుందరయ్య అక్కడ చేస్తున్న పెళ్ళి ఏర్పాట్లను చూసి రెచ్చిపోయి ఆ ఏర్పాట్లను తన్నివేసి, అడ్డొచ్చిన వాళ్ళను తోసివేస్తాడు. దాంతో అతనికి పిచ్చెక్కిందని ప్రకటించి భూషణం సుందరయ్యను పిచ్చాసుపత్రిలో చేరుస్తాడు. అసలు విషయం తెలుసుకొన్న సుబ్బులు సహాయంతో, భూషణం, సూరమ్మల డబ్బు పిచ్చి వదిలించి సుందరయ్య సుబ్బుల్ని పెళ్ళాడటంతో సినిమాకి శుభం. కాదు కాదు 'జైహింద్' కార్డు పడుతుంది.