మంగు రాజా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
రాజ గొప్ప దార్శనికుడు. ఆ ప్రతిభ ఆయన చేసిన పనులలో కనిపిస్తుంది. సంగీతం పట్ల ఆయనికి ఉన్న ఆసక్తి మరియు ఏళ్ళ తరబడి చేసిన పరిశోధనల వల్ల వచ్చిన పరిజ్ఞానం ఆయనిని అద్వితీయ విశ్లేషకుడిగా నిలిపాయి. రాజా తను రాసిన వ్యాసాలూ, విశ్లేషణలు, విమర్శలు ద్వారా సంగీత పత్రికా రచనలో ఒక కొత్త పంధాకి మార్గదర్శకులయ్యారు. ఆయన రచనలు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడమే కాకుండా కొత్త వారికి బైబిల్ లాగా ఉపయోగపడుతున్నాయి.
 
మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో [[కథలు]], నవలలు, సీరియల్స్ కూడా రాశారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తిని ముఖ్య పాత్రధారిగా చేస్తూ ప్రత్యక్ష పాత్రలతో రాజా రాసిన నవల "మల్లాది వెంకట కృష్ణమూర్తి" తెలుగు నవలా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అటువంటి ప్రయోగం అంతకు ముందు లేదు. ఈయన రచించిన మినీ కవితల సంకలనానికి డా.సి.నారాయణ రెడ్డి (జ్నాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత) 'మెరుపంత' గా పేరు పెట్టారు. ఈ మినీ కవితల సంకలనాన్ని నారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు రాజా. .
 
దూరదర్శన్ (తెలుగు ఛానల్) లో ప్రసారమైన 'బుచ్చిబాబు' అనే ధారావాహికకు రాసిన స్క్రిప్ట్ కు గాను రాజా బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డును అందుకున్నారు. ETV (తెలుగు ఛానల్) లో ప్రసారమవుతున్న 'పెళ్లి పందిరి' ధారావాహికకు ఈయన రాసిన స్క్రిప్టును ప్రేక్షకులు బాగా ఆదరించారు. రాజా కలానికి రెండు వైపులా పదును వున్నట్టుంటుంది ఆయన పద ప్రయోగం. శ్లేష, హాస్య చతురత ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.
 
రాజా రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రతి ఒక్కరి మనసును చూరగొంటాయి. ఆయన పనిచేసిన సంస్థలకు ఆయన ఒక గర్వ కారణంగా పరిగణించబడ్డారు. వార్త దినపత్రికలో వచ్చిన 'ఆపాతమధురం ' అనే శీర్షిక ఆ దిన పత్రిక యొక్క సర్కులేషన్ ను పెంచింది. రాజా సంపాదకత్వంలో వచ్చిన [[హాసం]] అనే తెలుగు పక్ష పత్రిక ది బెస్ట్ మ్యాగజైన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈయన 800 లకు పైగా గుర్తించదగ్గ వ్యాసాలను, సన్మాన పత్రాలను కూడా రాశారు. వందకు పైగా సినీ సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. [[యస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] నిర్వహించిన పాడాలని ఉంది (మా టీవీ) కార్యక్రమ పరంపరలో రెండు ఎపిసోడ్ లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
 
రాజా ప్రస్తుతం మా టీవీలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ ఛానల్ కోసం రాజా రూపొందించిన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంతో పాటు వివిధ బాషల ([[తెలుగు]], తమిళ్, కన్నడ, హిందీ, [[బెంగాలి]] మరియు ఇంగ్లీష్) సంగీతం పై సృజనాత్మ పరిశోధన 'మధుర క్షణాలు' ఆ ఛానల్ కు అర్కివల్ వాల్యూని తెచ్చిపెట్టింది.
 
==అవార్డులు మరియు సన్మానాలు==
"https://te.wikipedia.org/wiki/మంగు_రాజా" నుండి వెలికితీశారు