'మంగు రాజా (మ్యూజికాలజిస్ట్)

మార్చు

ఏ మనిషైనా సాంత్వన పొందేది సంగీతం తోనూ, హాస్యం తోనూ మాత్రమే. కాని ఒకరికి మాత్రం ఆ సంగీతం జీవనం, జీవనాధారం, శక్తీ. ఆసక్తీ, మతం, భక్తీ ఆన్నీ. అతనే 'మ్యూజికాలజిస్ట్ రాజా' గా పేరుగాంచిన రాజా..

బాల్యం

మార్చు

రాజా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జూన్ 10, 1951 న జన్మించారు. అతని తండ్రి అయిన ఎమ్.వి.ఆర్.పంతులు శ్రీకాకుళంలో పేరుగడించిన వకీలు. అతని తల్లి సుభద్రా దేవి మంచి వైణికురాలు. అతను 1972లో బీ.కామ్ పట్టభద్రుడయ్యారు. చిన్న వయసు నుండే సినిమాలు, సినమాల్లో సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో మంచి శ్రోత అయ్యారు. బాల్యంలో అభ్యసించిన జ్ఞానంతో యుక్త వయసులో సంగీత విమర్శకుడు అయ్యారు. కుటుంబం, స్నేహితులు ఇచ్చిన సహకారంతో రాజా సినీ సంగీత పై వ్యాసాలను రాయడం మొదలుపెట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. అప్పటినుండి వెనక్కు తిరిగి చూసే అవసరం లేకపోయింది.

వృత్తి

మార్చు

రాజ గొప్ప దార్శనికుడు. ఆ ప్రతిభ ఆయన చేసిన పనులలో కనిపిస్తుంది. సంగీతం పట్ల ఆయనికి ఉన్న ఆసక్తి, ఏళ్ళ తరబడి చేసిన పరిశోధనల వల్ల వచ్చిన పరిజ్ఞానం ఆయనిని అద్వితీయ విశ్లేషకుడిగా నిలిపాయి. రాజా తను రాసిన వ్యాసాలూ, విశ్లేషణలు, విమర్శల ద్వారా సంగీత పత్రికా రచనలో ఒక కొత్త పంధాకి మార్గదర్శకులయ్యారు. ఆయన రచనలు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడమే కాకుండా కొత్త వారికి బైబిల్ లాగా ఉపయోగపడుతున్నాయి.

మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తిని ముఖ్య పాత్రధారిగా చేస్తూ ప్రత్యక్ష పాత్రలతో రాజా రాసిన నవల "మల్లాది వెంకట కృష్ణమూర్తి" తెలుగు నవలా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అటువంటి ప్రయోగం అంతకు ముందు లేదు. ఈయన రచించిన మినీ కవితల సంకలనానికి డా.సి.నారాయణ రెడ్డి (జ్నాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత) 'మెరుపంత' గా పేరు పెట్టారు. ఈ మినీ కవితల సంకలనాన్ని నారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు రాజా. .

దూరదర్శన్ (తెలుగు ఛానల్) లో ప్రసారమైన 'బుచ్చిబాబు' అనే ధారావాహికకు రాసిన స్క్రిప్ట్ కు గాను రాజా బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డును అందుకున్నారు. ETV (తెలుగు ఛానల్) లో ప్రసారమవుతున్న 'పెళ్లి పందిరి' ధారావాహికకు ఈయన రాసిన స్క్రిప్టును ప్రేక్షకులు బాగా ఆదరించారు. రాజా కలానికి రెండు వైపులా పదును వున్నట్టుంటుంది ఆయన పద ప్రయోగం. శ్లేష, హాస్య చతురత ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.

రాజా రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రతి ఒక్కరి మనసును చూరగొంటాయి. ఆయన పనిచేసిన సంస్థలకు ఆయన ఒక గర్వ కారణంగా పరిగణించబడ్డారు. వార్త దినపత్రికలో వచ్చిన 'ఆపాతమధురం ' అనే శీర్షిక ఆ దిన పత్రిక యొక్క సర్కులేషన్ ను పెంచింది. రాజా సంపాదకత్వంలో వచ్చిన హాసం అనే తెలుగు పక్ష పత్రిక ది బెస్ట్ మ్యాగజైన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈయన 800 లకు పైగా గుర్తించదగ్గ వ్యాసాలను, సన్మాన పత్రాలను కూడా రాశారు. వందకు పైగా సినీ సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. యస్.పి. బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడాలని ఉంది (మా టీవీ) కార్యక్రమ పరంపరలో రెండు ఎపిసోడ్ లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

రాజా ప్రస్తుతం మా టీవీలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ ఛానల్ కోసం రాజా రూపొందించిన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంతో పాటు వివిధ భాషల (తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలి, ఇంగ్లీష్) సంగీతం పై సృజనాత్మ పరిశోధన 'మధుర క్షణాలు' ఆ ఛానల్ కు అర్కివల్ వాల్యూని తెచ్చిపెట్టింది.

అవార్డులు, సన్మానాలు

మార్చు

రాజా అందుకున్న అవార్డులు, సన్మానాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఇవీ : .

 • 2002లో అనేక మంది సంగీతాభిమానుల అభిమానాన్ని పొందేలా హాసం అనే పత్రికను రూపొందించి నడిపినందుకు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటా) నుండి అవార్డును రాజా గెలుచుకున్నారు.
 • 2007లో మ్యూజిక్ జర్నలిజంలో అందించిన సేవలకుగాను మద్రాస్ తెలుగు అకాడమీ రాజాకు 'సమైక్య భారత్ గౌరవ సత్కార' అవార్డును అందించింది.
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏటా ఇచ్చే టీవీ నందీ అవార్డులలో 2006 సంవత్సరానికి గాను రాజా రూపొందించిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గ్ గా బంగారు నందిని పొందింది...అందుకు గాను మెగాస్టార్ శ్రీ చిరంజీవి, శ్రీ నాగార్జున గారి చేత రాజా ప్రత్యేకంగా సన్మానించబడ్డారు కూడా.
 • శ్రీకాకుళం నుండి నంది అవార్డును గెలుచుకున్న మొదటి మీడియా వ్యక్తీ అయినందుకు శ్రీకాకుళం యునియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వారు, ధర్మాన ప్రసాద్ రావు (MLA, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్, మరియూ రెవెన్యూ మంత్రి) రాజాను సన్మానించారు.
 • 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమము పాత తరం నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతల మధుర జ్ఞాపకాలను వెలికితీస్తుంది.1941నుండి సినీ పరిశ్రమలో హీరోగా ప్రత్యేక మైన ముద్ర వేసుకున్న పద్మవిభూషణ్, డా..అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన ముఖాముఖి 74 ఎపిసోడ్ల వరకు కొనసాగింది. ఒకే వ్యక్తిపై ఇన్ని ఎపిసోడ్ లు రావడం తెలుగు టీవీ చరిత్రలో ఇంతవరకూ లేదు. ఈ ముఖాముఖీ కార్యక్రమం ద్వారా పంచుకోని మధుర క్షణాలు లేవని, రాజా తన జీవిత చరిత్రను మొత్తం వెలికితీశారని అక్కినేని నాగేశ్వరరావుగారు ప్రెస్ మీట్ లో చెప్పారు. రాజా చేసిన కృషికి గుర్తుగా మోసర్బేర్ సంస్థ ఈ కార్యక్రమాన్ని CD ల రూపంలో తెచ్చేందుకు ముందుకు వచ్చింది. 74 ఎపిసోడ్ల ఈ ముఖాముఖీ కార్యక్రమాన్ని 25 CD లుగా అక్కినేని గుర్తుకొస్తున్నాయి' అనే పేరుతో విడుదలచేసారు. దీని వేల రూ.. 875.

కొనసాగుతున్న ప్రయాణం

మార్చు
 • సినీ సంగీత శిఖరాన్ని అధిరోహించే ప్రయాణంలో రాజా ఎప్పుడూ అలసటను అనుభవించలేదు. అతని నిబద్దతా, అంకిత భావం, కృత నిశ్చయం భావి తరాలకు మార్గదర్శకం.
 • 40,000 పైచిలుకు ఉన్న పాటల లైబ్రరి రాజా సొంతం. రెండు వేల పైగా సినిమాలు, వేయికి పైగా రెఫరెన్సుపుస్తకాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి.
 • క్లుప్తంగా, రాజాను తెలుగు సినిమా యొక్క వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా పిలవచ్చు. తను రాసిన చరిత్రను తనే తిరిగి రాయగల చరిత్రకారుడు ఉన్నందుకు తెలుగు సినిమా గర్విస్తుంది.
 • మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా ఒక బ్లాగును ఏర్పాటు చేసి దానిని వ్యక్తిగత డైరీగా నిర్వహిస్తున్నారు.
 • అతి తొందర్లో, రాజా తన సొంత వెబ్ సైట్ ద్వారా ఏళ్ళ తరబడి తెలుగు సంగీతం పై చేసిన పరిశోధనా ఫలితాల వల్ల వచ్చిన పరిజ్ఞానాన్ని సంగీత ప్రియులకు అందించనున్నారు.

మూలాలు

మార్చు
 1. తెలుగు ఫిలిం ట్రేడ్ గైడ్ 03 నవంబర్ 2010[permanent dead link],
 2. [1][permanent dead link],
 3. [2],
 4. [3],
 5. [4],
 6. [5],
 7. [6],
 8. [7][permanent dead link],
 9. [8][permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మంగు_రాజా&oldid=4107571" నుండి వెలికితీశారు