ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , గ్రంధము → గ్రంథము (7) using AWB
పంక్తి 14:
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీ శిశువు లభించింది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలో [[భూదేవి]]. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి [[శ్రీకృష్ణుడు]] ఇప్పుడు శ్రీరంగంలో[[శ్రీరంగం]]లో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి [[విష్ణువు]] యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
 
ఈ గ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి.మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంథప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు