గుండె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
పంక్తి 2:
'''గుండె''' లేదా '''హృదయం''' ([[లాటిన్]]: Cor. [[జర్మన్]]: Herz. [[ఆంగ్లం]]: Heart. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన [[అవయవం]]. ఒక ప్రత్యేకమైన [[కండరాలు]] నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది [[ఛాతీ]] మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
== గుండె నిర్మాణం ==
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది ఉరఃకుహరంలో[[ఉరఃకుహరం]]లో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.
[[File:Gunde-Te.ogg]]
గుండెను ఆవరించి రెండు పొరలు కలిగిన [[హృదయావరణ త్వచం]] (Pericardial membrane) ఉంటుంది. ఈ రెండు పొరలనూ వేరుచేస్తూ [[హృదయావరణ ద్రవం]] (Pericardiac fluid) తో నిండి ఉన్న [[హృదయావరణ కుహరం]] (Pericardial cavity) ఉంటుంది. ఈ [[ద్రవం]] గుండెను బాహ్య అఘాతాల నూచి కాపాడటమే కాక, గుందెగుండె కదలికలో కలిగే రాపిడిని నివారిస్తుంది.
 
గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది), మధ్యలో ఉన్న మయోకార్డియమ్ (హృదయ కండరాలతో ఏర్పడుతుంది), లోపలి ఎండోకార్డియమ్ (శల్కల ఉపకళతో ఏర్పడుతుంది) .
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు