దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
దార్ల వెంకటేశ్వరరావు దళిత సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్నారు. వీచిక సాహిత్య విమర్శ గ్రంథంలో ‘దళిత సాహిత్యం-మౌలిక భావనలు’ పరిశోధక వ్యాసంలో తెలుగు దళిత సాహిత్యం ఆరంభం,వికాసాలను, వివిధ ప్రక్రియలను విశ్లేషించారు<ref>[దార్ల వెంకటేశ్వరరావు, వీచిక(సాహిత్య విమర్శ వ్యాసాలు) సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.పుటలు: 59-78]</ref>. దళిత సాహిత్యాన్ని కేవలం దళితులే రాయనవసరం లేదనీ, ఆచరణాత్మకమైన దృక్పథంతో ఎవ్వరైనా రాయొచ్చని ఈయన అభిప్రాయం. శ్రీపాద సుబ్రహ్మణ్యం, అరుణకుమార, మంగిపూడి వెంకటశర్మ మొదలైన వారు రాసిన సాహిత్యంలో దళితుల జీవితాల పట్ల సానుభూతి వ్యక్తమవుతుందన్నారు.
దళిత సాహిత్యాన్ని ఎవరు రాసినా దాని మౌలిక స్వభావం, లక్ష్యాలను వీడనంతవరకు దాన్ని దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చుననే ఆలోచన ఇంచుమించుగా సర్వాంగీకారం పొందింది. కింది విషయాలు గమనిస్తే ఈ మౌలికాంశాలు ఉన్నదే దళిత సాహిత్యమని స్పష్టమవుతుంది.
# 1. ప్రాచీన, సాంప్రదాయిక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని (కులవ్యవస్థని) తిరస్కరించటం.
# 2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఆశించే మానవతా దృక్పథాన్ని ఆశించటం.
# 3. హేతువుకు అందని అతీంద్రియ భావాలను తిరస్కరించటం.
# 4. వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి జీవితానుభవాలను సృజనీకరించటం.
# 5. వస్తువుకి రూపం సహకారి కావటం, సాహిత్యం సామాజిక చైతన్యాన్ని ఆకాంక్షించేటట్లు రూపొందటం, కళ సమాజం కోసమే అన్న దృక్పథానికి కట్టుబడటం.
# 6. సత్యం, శివం, సుందరం అనే భావనలను తిరస్కరించటం.
# 7. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాడటం.
# 8. కర్మ, పునర్జన్మ, పరమాత్మ వంటి భావనలను నిరసించటం.
# 9. దళితుల భాషను, ఆచార వ్యవహారాలను గౌరవించి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించటం.
# 10. హిందూ లేదా మూఢత్వాన్ని ప్రబోధించే మత భావనలను తిరస్కరించి, ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం.
# 11. అస్పృశ్యత కారణంగా దూరంగా విసిరేయబడిన వారిని ప్రధాన జీవన స్రవంతిలో కలపటం, కులాన్ని నిర్మూలించటం ప్రధాన లక్ష్యాలుగా గ్రహించటం.
# 12. దళిత సాహిత్యాన్ని రాయటం వినోదం కోసం కాదనీ, సామాజిక చైతన్యం, సామాజిక పరివర్తనకు బాధ్యతాయుతమైన పనిగా గుర్తించటం - దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా సాహిత్యం ప్రేరణనివ్వటం. దళిత సాహిత్య స్వభావాన్ని తెలుసుకోవటానికి పై అంశాలను క్రోడీకరించినా, "దళిత సాహిత్యం' అని పిలుస్తున్న అన్ని రచనలకూ పైన పేర్కొన్న అన్ని లక్షణాలు సరి పోతున్నాయని చెప్పే వీలు లేదు. కానీ, మౌలికంగా ఈ లక్షణాలు చాలా వరకు దళిత సాహిత్యంలో కనిపిస్తున్నాయని దార్ల వెంకటేశ్వరరావు వివరించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}