నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
==వ్యక్తిగత జీవితము==
ఇతనికి 19 ఏళ్ళ వయసులోనే 1985 లో పెళ్ళయింది. భార్య పేరు - జమీలా. వాళ్ళది [[తెనాలి]]. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేది. ఇతని జీవితంలో అది మరపురాని తేది. సాక్షాత్తూ వీరి గురువు [[కె.చక్రవర్తి]] గారు, [[ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]] గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె. పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. పెద్దవాడు షకీర్ తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. అమ్మాయి సోఫియా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే [[అమెరికా]] వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది<ref name="మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!">http://www.sakshi.com/news/movies/exclusive-interview-with-singer-mano-178728?pfrom=home-top-story</ref>.
 
==అస్థిపాస్తులు==
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు