నాగూర్ బాబు

గాయకుడు, మరియు డబ్బింగ్ కళాకారుడు

నాగూర్ బాబు (మనో) నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడాడు.

నాగూర్ బాబు
NagurBabu.jpg
నాగూర్ బాబు
జననం
నాగూర్ బాబు

(1965-10-26) 1965 అక్టోబరు 26 (వయసు 57)
ఇతర పేర్లుమనో
వృత్తినేపథ్య గాయకుడు
సంగీత దర్శకుడు
నిర్మాత
నటుడు
క్రియాశీల సంవత్సరాలు1985 – ఇప్పటివరకు (నటుడిగా 1979-1992)
జీవిత భాగస్వామిజమీలా
పిల్లలుషకీర్ (కుమారుడు),
సోఫియా (కుమార్తె),
రతీష్ (కుమారుడు)
తల్లిదండ్రులు
  • రసూల్ (తండ్రి)
  • షహీదా (తల్లి)

నేపథ్యముసవరించు

నాగూర్ బాబు సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవాడు. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. ఇళయరాజా ఆయన పేరును మనోగా మార్చాడు.

మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలు పాడారు.

గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది. రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు పొందాడు. బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.

పేరు వెనుక చరిత్రసవరించు

ఇతని అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. ఇతని అమ్మ పేరు షహీదా, పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం వీరిది. వీరి తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు అక్టోబర్ 26న ఇతను పుట్టాడు. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు.[1]

ఇష్టాలుసవరించు

ఆయన అభిమాన గాయకులు కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం.[2] ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. ఇంకా హిందీలో గుల్షన్ కుమార్ తో మంచి హిట్లున్నాయి. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.

మత సామరస్యంసవరించు

  • "పేరుకు ముస్లిం సంప్రదాయమైనా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటామో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం.--నాగూర్ బాబు
  • "మేం ఏటా తిరుమలకు కాలినడకన వెళతాం. ఆయన శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు."—నాగూర్ బాబు భార్య జమీలా.[3].

వ్యక్తిగత జీవితముసవరించు

ఇతనికి 19 ఏళ్ళ వయసులోనే 1985లో పెళ్ళయింది. భార్య పేరు - జమీలా. వాళ్ళది తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేది. ఇతని జీవితంలో అది మరపురాని తేది. సాక్షాత్తూ వీరి గురువు కె.చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. పెద్దవాడు షకీర్ తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. అమ్మాయి సోఫియా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే అమెరికా వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది[1].

అస్థిపాస్తులుసవరించు

నాగూర్ బాబు స్థిరాస్తి వ్యాపారం ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు.[4]

Manoసవరించు

పాట చిత్రం సాహిత్యం సహ గాయకులు
ప్రియా ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు కిల్లర్
ఓ లైలా లైలా పెళ్ళి చేసుకుందాం భువనచంద్ర స్వర్ణలత
అడీస్ అబాబా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ సమరసింహారెడ్డి

మూలాలుసవరించు

  1. 1.0 1.1 http://www.sakshi.com/news/movies/exclusive-interview-with-singer-mano-178728?pfrom=home-top-story
  2. ఫిబ్రవరి 1, 2009 ఈనాడు ఆదివారం సంచిక
  3. ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-31. Retrieved 2010-10-30.