"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==విశేషాలు==
ఈమె [[గుంటూరు]]. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద [[హిందుస్తానీ సంగీతం]] నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో '''సతీఅనసూయ ధృవవిజయం''' అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.<ref>[http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=13511 ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7] </ref> 1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi R Balasaraswathi (b. 1928)]</ref>
===సంగీత అభ్యాసం===
వీరి ఇంటి వాతావరణ ప్రభావంవల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండీ సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ ఈమె ట్యూటర్‌. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. నాన్నగారు ఎంతోశ్రద్ధగా [[బొంబాయి]] తీసుకెళ్ళి వసంత దేశాయ్‌ దగ్గర [[హిందూస్థానీ సంగీతం]] నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో గూడవల్లిగారి[[గూడవల్లి]]గారి చిత్రంలో నటించింది.
===నాన్న కల===
మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా, ఆరేళ్ళ వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కానీ ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
 
===భక్త కుచేల, బాలయోగిని===
మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో (1934-40) తమిళ, తెలుగు చిత్రాల నిర్మాణం ఎక్కువ బొంబాయి, కలకత్తాల్లోనే. అలా కె.సుబ్రహ్మణ్యంగారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్‌ ఇండియా స్టూడియోలో ‘భక్త కుచేల’ తమిళ చిత్ర నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేశారు. కృష్ణస్వామి ప్రొడ్యూస్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ పాపనాశం శివన్‌ కుచేలుడుగా , భార్యగా యస్‌.డి.సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో ఈవిడది బాలకృష్ణుడి పాత్ర. ఈవిడ పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. ‘బాలయోగిని’‘[[బాలయోగిని]]’ తమిళ చిత్రంలో ఈవిడది టైటిల్‌ పాత్ర. ఈ చిత్రంతోనే ఈవిడ పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచీ ఆ పేరే ఈవిడకు స్థిరపడిపోయింది. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి 1937 లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్‌.చేలమ్‌, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి.వత్సల తదితరులు నటించారు. ఈవిడకు 1500 పారితోషికం ఇచ్చారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===గూడవల్లిగారి ‘ఇల్లాలు’ ===
గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ఇల్లాలు’ చిత్రంలో ఈవిద నటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్ళతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలననీ తెలిశాక, సంగీత దర్శకుడు [[సాలూరి రాజేశ్వరరావు]]గారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, ఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించారు. ఆయనతో నటించడం తల్చుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. [[బసవరాజు అప్పారావుగారు]] పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరోహీరోయిన్లు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
 
===ద్విభాషాచిత్రం భక్తతుకారాం===
 
===డాన్సింగ్‌ గర్ల్‌ ===
ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ బొంబాయిలో నిర్మించారు. ఈవిడ హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. [[ఎస్‌.రాజేశ్వరరావుగారిరాజేశ్వరరావు]]గారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ ఈవిడే పాడింది. [[ఎం.జి.రామచంద్రన్‌]] శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===కోలంక రాజా వారితో వివాహం===
 
===రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడింది===
ఈవిడ జీవితంలో మరువలేని సంఘటన వీరి శ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది. కారణం ఏమిటంటే, ఈమె సినీ జీవితం యధాతథంగా సాగుతుందని వివాహానికి ముందు ఈవిడకు వీరి శ్రీవారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో ఈవిడ హిట్‌ సాంగ్స్‌, నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో భార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. ఈవిడను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ర్టీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదనీ, వారిని సంతోషపరచడమే తన విధిగా భావించి చాలా పాటలు వీరి శ్రీవారికి తెలియకుండా పాడింది. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, [[మలయాళ]], సింహళ భాషల్లో రెండువేల పాటలు పాడింది. ఎన్నో చిత్రాల్లో నటించింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, [[షావుకారు]], [[దేవదాసు]], [[లైలామజ్ను]], [[భాగ్యలక్ష్మి]], [[మంచిమనసుకు మంచిరోజులు]].. చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల, వైదేహి, ఎం.ఎ్‌స.రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడింది. ఈవిడ పాడిన ఆఖరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ....’<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===రేడియోలో పాటలు===
1944లో మద్రాసు [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఈవిడ లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు ఈవిద ఎంతో గర్వపడుతుంది. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], బసవరాజు అప్పారావు, [[ఆరుద్ర]], [[ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి]], [[బాలాంత్రపు రజనీకాంతరావులురజనీకాంతరావు]]లు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడింది. అప్పట్లో ఈవిడ ‘రాధామాధవం’ సీడీ శ్రోతలను అలరించింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===నిజంగా తాగి నటిస్తున్నారేమో! ===
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2053600" నుండి వెలికితీశారు