వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పెళ్లి → పెళ్ళి, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వక్కలంక సరళ''' ([[1927]] - [[1999]]) <ref name=the_hindu>{{cite news|title=Rhythm of recall|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/rhythm-of-recall/article3748008.ece|accessdate=2 December 2014|work=The Hindu|issue=August 10, 2012}}</ref> [[తెలుగు సినిమా]] గాయని. [[కీలుగుర్రం]] సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో [[జెమినీ స్టూడియో]] హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.<ref>[http://www.hindu.com/mp/2003/02/05/stories/2003020500420300.htm Living out a dream - The Hindu Feb 05, 2003]</ref> ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే [[మద్రాసు]]లో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, [[చలం]] (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు<ref>[http://www.pranahita.org/2009/03/kutumbamlo_sangeetam/ కుటుంబంలో సంగీతం - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌]</ref> సరళ 1927, [[ఆగష్టు 8]] న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.
 
ఆమెకు అలనాటి సినీనటి [[అంజలీదేవి]]కి మంచి స్నేహితురాలు. [[అంజలీదేవి]] మొదటిసినిమా [[బాలరాజు]]లో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి '[[స్వప్నసుందరి]]' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.<ref>[http://m.newshunt.com/Eenadu/warangal/20839572/997 అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు]</ref> ఈమే [[కూచిపూడి]] నాట్యకళాకారిణి, [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ]] గ్రహీత స్వప్నసుందరి.
 
[[ఘంటసాల వేంకటేశ్వరరావు|ఘంటసాల]]తో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా' పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో[[ఘంటసాల]]తో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.<ref>http://teblog.kinige.com/?tag=jeevita-katha</ref>
 
సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1971లో విడుదలైన [[గోరింటాకు]] సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.<ref>http://www.cinegoer.net/gorintaku.htm?ModPagespeed=noscript</ref>
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_సరళ" నుండి వెలికితీశారు