సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , తో → తో , సాంప్రదాయా → సంప్రదాయా, నేప using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
=== సంగీత దర్శకునిగా ===
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన '[[సేతు బంధన్‌]]' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన '[[భట్టి విక్రమార్క]]' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ''ప్రముఖ నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ''గాయని [[లతా మంగేష్కర్‌]] అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమెతో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పనిచేశారు. '[[సంసారం]]' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', '[[సర్వాధికారి]]' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), '[[నర్తనశాల]]' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు [[ఎం.ఎస్‌. విశ్వనాథన్‌]] సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. [[జమునా రాణి]], [[పి. లీల]], బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! '[[సంతానం]]' (1955)తో లతా మంగేష్కర్‌నూ, '[[ఇలవేలుపు]]' (1956)తో [[రఘునాథ్‌ పాణిగ్రాహినీపాణిగ్రాహి]]నీ, '[[వచ్చిన కోడలు నచ్చింది]]' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, '[[నర్తనశాల]]' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' ([[శివాజీ గణేశన్‌]], పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!
సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు [[చక్రవర్తి]] దగ్గర పాటల రికార్డింగుల్లో [[వయొలిన్‌]] వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు.
 
=== నటునిగా ===