స్థానం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
పంక్తి 44:
1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర నాటకం]]లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలి లోని [[శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించాడు.
 
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు [[రంగస్థలం]] మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.
 
వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/స్థానం_నరసింహారావు" నుండి వెలికితీశారు