అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో [[బెంగాల్ విభజన]] వ్యతిరేక ఉద్యమంలోను, [[హోంరూలు ఉద్యమం]]లోను వీరు పనిచేశారు. [[మహాత్మా గాంధీ]] నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.
 
రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. [[విజయవాడ]]లోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. [[కొమర్రాజు లక్ష్మణరావు]] నెలకొల్పిన [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]]లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు [[కారాగారం]]లో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', '[[అమెరికా]] సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.
 
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు [[విజయవాడ]] పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన [[విజయవాడ పురపాలక సంఘ]] అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
 
==మద్రాసు శాసనసభలో==