జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==సినిమా జీవితం==
చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. ఈమె కన్నడ మెగా హీరో [[రాజ్ కుమార్]]తో అందరు హీరోయిన్లకన్నా ఎక్కువగా 30 సినిమాలలో నటించారు. ఆమె [[మాతృభాష]] తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. అమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.
 
[[ఎన్.టి.రామారావు]]తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]]లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు