జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]-- మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]గా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం]] యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. [[ఎం.జీ.ఆర్]] రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
పంక్తి 48:
సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.<ref>{{cite web |url=http://www.dnaindia.com/india/report-tamil-nadu-cm-jayalalithaa-disproportionate-assets-case-court-to-deliver-verdict-shortly-2021902 |title=Tamil Nadu CM J Jayalalithaa convicted to 4 years imprisonment in disproportionate assets case|work=[[DNA (newspaper)|DNA]] |date=27 Sep 2014 |accessdate=27 September 2014}}</ref><ref>{{cite news|url=http://www.bbc.com/news/world-asia-india-29390682|accessdate=27 September 2014|publisher=BBC News Online|date=27 September 2014|title=Top India politician Jayalalitha jailed for corruption}}</ref> మే 11, 2015న [[కర్ణాటక]] ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని[[చెన్నై]]లోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి.
 
== బాల్యం ==
జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.<ref>{{Cite news|url=http://www.dnaindia.com/mumbai/report-j-jayalalithaa-s-victory-in-tamil-nadu-finds-resonance-in-mumbai-1989569|title=Jayalilathaa victory finds resonance|publisher=DNA|access-date=2 February 2016}}</ref> జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
 
[[తిరుచ్చి జిల్లా]] [[శ్రీరంగం]] పూర్వీకంగా కలిగిన జయలలిత [[1981]]లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య [[జానకి రామచంద్రన్]] తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత [[1989]] అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. [[1991]]లో [[రాజీవ్ గాంధీ]] మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]]తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి [[2006]] [[మే]]లో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
 
కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట [[సినిమా]] రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా [[చిన్నడ గొంబె]] [[కన్నడ]] చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా [[మనుషులు మమతలు]] ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో [[తమిళనాడు]] [[ప్రభుత్వము]] జయలలితను [[కళైమామణి పురస్కారము]]తో సత్కరించింది. ఈమె [[అవివాహిత]] గానే జీవితాన్ని గడిపారు.
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు