కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బంది → బంధి, స్వేచ్చ → స్వేచ్ఛ, → (4), , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
'''కార్బన్ మొనాక్సైడ్''' రంగు, వాసన మరియు రుచి లేనటువంటి, గాలికన్న బరువైన [[వాయువు]]. వాతావరణంలో 35ppm మించి ఉన్నచో మనుష్యులకు ప్రమాదకరం. జీవుల, జీవ ప్రక్రియ సమయంలో అల్ప ప్రమాణంలో కార్బన్ మొనాక్సైడ్ ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్ ఒక [[కార్బన్]] [[పరమాణువు]], మరో [[ఆక్సిజన్]] పరమాణువుతో త్రిబంధ సంయోగం ఏర్పరచు కొనుట వలన ఏర్పడును. [[అణువు]] లోని త్రిబంధాలలో రెండు సమయోజనీయ బంధాలు కాగా మూడవది ద్విదృవ సమయోజనీయ బంధం.ఇది అతి సాధారణంగా ఆక్సోకార్బన్, సైయనైడ్ అయానులతో, నైట్రోసోనియం కేటయాన్‌తో, మరియు [[నత్రజని]] [[అణువు]]తో ఐసో ఎలెక్ట్రానిక్ గా ప్రవర్తించును. సమన్వయ సంక్లిష్ట సమ్మేళనాలలో కార్బన్ మొనాక్సైడ్ లిగండ్ (ligand) ను కార్బోనైల్ అందురు.
 
కార్బన్ కలిగిన పదార్థాలను పాక్షికంగా ఆక్సీకరణం చెయ్యడం వలన కార్బన్ మొనాక్సైడ్ వాయువును ఉత్పత్తి చెయ్యవచ్చును. కార్బన్ కలిగిన పదార్థాల లేదా సేంద్రియపదార్థాల దహనసమయంలో [[కార్బన్ డయాక్సైడ్]]ను ఉత్పత్తి చెయ్యుటకు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు కార్బన్ మొనాక్సైడ్ ఏర్పడును.మూసి వుంచిన/ సంవృత ఆవరణలో, తక్కువ [[గాలి]] అందుబాటు ఉన్న ప్రదేశాలలో స్టవ్ వెలుగుతున్నప్పుడు, లేదా అంతర్గత దహన యంత్రాలు పనిచేయునపుడు కార్బన్ మొనాక్సైడ్ అధిక ప్రమాణంలో ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్‌ను ఆక్సిజన్ సమక్షంలోలేదా [[వాతావరణం]] లోని గాలిలో నీలి జ్వాల వెలువరిస్తూ మండి కార్బన్ డయాక్సైడ్‌ను వెలువరించును.
 
[[1960]]కు ముందు కాలంలో ఇళ్ళలో దీపాలను వెలిగించుటకు, వంట వండుటకు, మరియు వేడి చెయ్యుటకు ఉపయోగించిన కోల్ గ్యాస్‌, అధిక శాతం కార్బన్ మొనాక్సైడ్‌ను కలిగి యుండెడిది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇనుప ఖనిజాన్ని కరిగించి [[ఇనుము]]ను ఉత్పత్తి చెయ్యునపుడు కార్బన్ మొనాక్సైడ్ ఉపఉత్పత్తిగా ఏర్పడు చున్నది.
పంక్తి 91:
==చరిత్ర==
ఆరిస్టాటిల్ (384–322 BC) మొదటగా కార్బన్ మొనాక్సైడ్ వాయువు ఉనికి గురించి నమోదు చేసాడు.రాకాసి బొగ్గును (coal) మండించి నపుడు కొన్నివిషవాయులువెలువడుతున్నాయిఅని గుర్తించాడు. 1776
లో ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త డిలాస్సోనె (de Lassone, జింకు ఆక్సైడ్‌ను కోక్ తో మండించి కార్బన్ మొనాక్సైడ్‌ను ఉత్పత్తి చేసాడు. అయితే ఈ వాయువు నీలి మంటతో మండటం వలన, హైడ్రోజన్ వాయువు వలన కార్బన్ మొనాక్సైడ్‌ ఉత్పన్న మగుచున్నదని భావించాడు. [[1800]] లోస్కాటిష్ శాస్త్రవేత్త William Cumberland Cruikshank కార్బన్ మొనాక్సైడ్ వాయువు, కార్బన్ మరియు ఆక్సిజన్ కలిగి ఉన్నదని నిరూపించాడు <ref>Cruickshank, W. (1801) [http://books.google.com/books?id=t4tEAAAAcAAJ&pg=PA1#v=onepage&q&f=false "Some observations on different hydrocarbonates and combinations of carbone with oxygen, etc. in reply to some of Dr. Priestley's late objections to the new system of chemistry,"] ''Journal of Natural Philosophy, Chemistry and the Arts'' [a.k.a. ''Nicholson's Journal''], 1st series, '''5''' : 1–9.</ref><ref>Cruickshank, W. (1801) [http://books.google.com/books?id=t4tEAAAAcAAJ&pg=PA201 "Some additional observations on hydrocarbonates, and the gaseous oxide of carbon,"] ''Journal of Natural Philosophy, Chemistry and the Arts'', 1st series, '''5''' : 201–211.</ref>.[[1846]]లో క్లాడ్ బెర్నాడ్ అనునతడు దీనిని కుక్కలపై పలు మార్లు ప్రయోగించి ఈవాయువు యొక్క విషప్రభావాన్ని నిర్దారణ చేశారు<ref>{{Cite book|url=http://books.google.com/?id=FvgNKPxb43IC&pg=PA38|page=38|title=Molecules of death|author=Waring, Rosemary H.; Steventon, Glyn B. and Mitchell, Steve C. |publisher=Imperial College Press|year=2007|isbn=1-86094-814-6}}</ref>.
 
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో, గ్యాసోలిన్, మరియు [[డీసెల్]] కొరత ఏర్పడిన సమయంలో యంత్ర వాహనాలను నడుపుటకై వాడు వాయు ఇంధనమిశ్రమంలోఇంధన మిశ్రమంలో కార్బన్ మొనాక్సైడ్‌ను కూడా మిశ్రమం చేసి ఉపయోగించారు.
 
==భౌతిక లక్షణాలు==
కార్బన్ మొనాక్సైడ్ రంగు, వాసన మరియు రుచి లేనటువంటి, గాలికన్న బరువైన వాయువు.కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం 28.01 గ్రాములు/మోల్. కార్బన్ మొనాక్సైడ్ ద్రవంగా ఉన్నప్పుడు [[సాంద్రత]] .789గ్రాములు/సెం.మీ<sup>3</sup>. కార్బన్ మొనాక్సైడ్ వాయురూపంలో ఉన్నప్పుడు, 0°Cవద్ద, ఒక అట్మాస్ఫియర్‌ వత్తిడివద్ద కార్బన్ మొనాక్సైడ్ సాంద్రత 1.250 కిలోలు/మీటరు<sup>3</sup>మరియు 25&nbsp;°C, ఒక అట్మాస్ఫియర్ (1atm) వత్తిడి వద్ద 1.145 కిలోలు.మీ<sup>3</sup>సాంద్రత కల్గి ఉండును.కార్బన్ మొనాక్సైడ్ యొక్క [[ద్రవీభవన స్థానం]] −205.02&nbsp;°C (−337.04&nbsp;°F; 68.13K) .మరియు కార్బన్ మొనాక్సైడ్ యొక్క [[బాష్పీభవన స్థానం]]−191.5&nbsp;°C (−312.7&nbsp;°F; 81.6K) . 25°Cవద్ద, నీటిలో కార్బన్ మొనాక్సైడ్ యొక్క ద్రావణియత 27.6 మి.గ్రాములు/లీటరుకు.కార్బన్ మొనాక్సైడ్ క్లోరోఫారం, [[ఎసిటిక్ ఆమ్లం]], ఇథైల్ అసిటేట్, [[ఇథనాల్]], [[అమ్మోనియం హైడ్రాక్సైడ్]], మరియు బెంజీన్ లలో కరుగును. మొనాక్సైడ్ యొక్క వక్రీభవన సూచిక 1.0003364.ఈ వాయువు యొక్క ఫ్లాష్ స్థానం −191&nbsp;°C (−311.8&nbsp;°F; 82.1K, మరియు కార్బన్ మొనాక్సైడ్ యొక్క తనకు తానుగా మండే/స్వయందహన ఉష్ణోగ్రత (Autoignition temperatute) 609&nbsp;°C (1, 128&nbsp;°F; 882K) . ఈ వాయువు యొక్క విశిష్ట ఉష్ణ సామర్ధ్యం 29.1 జౌల్/K మోల్.
 
==అణు లక్షణాలు==
కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం 28.0.గాలి యొక్క సరాసరి అణుభారం 28.8 .కావున కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం గాలి కన్న కాస్త తక్కువ. కార్బన్ మరియు ఆక్సిజన్ పరమాణుల మధ్య బంధ దూరం 112.8 pm<ref name=gilliam>{{Cite journal|author=Gilliam, O. R.; Johnson, C. M. and Gordy, W. |title=Microwave Spectroscopy in the Region from Two to Three Millimeters|year=1950|journal=[[Physical Review]]|volume=78|issue=2|pages=140–144|doi=10.1103/PhysRev.78.140|bibcode = 1950PhRv...78..140G }}</ref>. కార్బన్ మొనాక్సైడ్ మూడు కోవాలెంట్/సమయోజనీయ బంధాలు కలిగి ఉండటం వలన, దీని బంధ దూరం నత్రజని (N<sub>2</sub>) వలె స్థిరమైనది. నత్రజని యొక్క బంధ దూరం మరియు అణుభారం, కార్బన్ మొనాక్సైడ్ కు సమానం.
 
==బంధం-ద్విద్రువ చలనం==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు