అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
దసరా పండుగను చాల ఘనంగా నిర్వహిస్తారు.అప్పాజిపేట ఎక్కడెక్కడో నివసిస్తున్న ప్రజలు దసరా పండగకి తప్పకుండా వస్తారు. అన్ని రకాల పిండి వంటలు చేస్తారు. పిల్లలు ఉత్సవంగా బాణసంచా కలుస్తారు. అందరు కొత్త దుస్తులు ధరిస్తారు.సాయంత్రం ఊరి చివరినా జరిగే జమ్మి పూజకు భారీగా ప్రజలు తరలివెళ్తారు.సాంప్రదాయబద్దంగా నిర్వహించిన జమ్మిపూజలో పాల్గొని తర్వాత గ్రామంలో ప్రతిష్టించిన దుర్గ మాతా ని దర్శిస్తారు.
=== బతుకమ్మ ===
సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాna ప్రజలకు పండుగల నెలలు.ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి.ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.రాష్ట్రమంతా అన్ని వర్గాల మహిళలుచేసుకునే పండగ అప్పాజిపేట గ్రామంలో మాత్రం ఒక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే బతుకమ్మలో పాల్గొంటారు.పవిత్రంగా మహిళలు ఎంతో అందంగా తయారు చేసిన బతుకమ్మను సాయంత్ర వేళలో కచ్చిర్ దగ్గరికి తీసుకొచ్చి బతుకమ్మ పాటలు పడుతూ నృత్యమాడుతారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముత్యాలమ్మ చెరువులో బతుకమ్మను సమర్పిస్తారు.
 
== బ్యాంకులు ==
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు