శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 41:
==పదబంధ నేర్పరి శ్రీపాద వారు==
గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంధాలను రాసారు. పద్యం, గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.
==పత్రికా సంపాదకుడిగా==
శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును [[మదరాసు]]లో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.
|