శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

తెలుగు కవి

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (జననం: 1866 - మరణం: 1960) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
Sripada krishnamurti sastry.jpg
జననం1866, అక్టోబరు 29
దేవరపల్లి
మరణం1960, డిసెంబరు 29
వృత్తిరచయిత
పిల్లలుకల్లూరి విశాలాక్షమ్మ,
సుదర్శన శాస్త్రి
తల్లిదండ్రులు
 • వెంకట సోమయాజులు (తండ్రి)
 • వెంకట సుబ్బమ్మ (తల్లి)

జననంసవరించు

కృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఎర్నగూడెం లో 1866 సంవత్సరంలో అక్టోబరు 29 వ తేదీనాడు (అక్షయ సం. ఆశ్వయుజ బహుళ షష్థీ సోమవారము) రాత్రిజాము గడిచిన పిదప పునర్వసు తృతీయ చరణమున వెలనాటి వైదిక బ్రాహ్మణ వంశంమున వెంకట సుబ్బమ్మ వెంకట సోమయాజులను పుణ్యదంపతులకు జన్మించారు/

పదుగురు పిల్లలు గతించిన పిదప వల్మీక ప్రాంతమున శ్రీకృష్ణారాధనము చేసిన ఆనంతరము జనించి, విషూచివలన రెండేళ్ళ ప్రాయమున అస్తమించి, శ్వశానవాటికలో పునర్జన్మ నంది, గర్భాష్థనము దాటిన పిదప ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, రఘువంశ పరిశీలనమందె సంస్కృత కవనపుజాడలు గ్రహించి, 16వయేట తెలుగు కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. వీరి కుమార్తె కల్లూరి విశాలాక్షమ్మ కూడా కవయిత్రి. ఈమె శతకాలు, కావ్యాలు 30కి పైగా వ్రాశారు.

పండితయశస్విసవరించు

'ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ ఉన్నాయి. ఆ బిరుదులన్నీ సార్థక బిరుదులే. శతాధిక గ్రంథాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు. యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్ఠలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు. అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంథాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంధ్రాయూనివర్సిటీకి ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు.

వీరికృతులలో ముగుల ప్రధానమైనది భారతాంధ్రీకరణము. లక్షశ్లోకములను కొన్ని వేల పద్యములందు పరివర్తన మొనరించిరి.ఆంధ్రశారదకు ఎనలేని భూషణములను సమర్పించిరి.తిక్కన భారతములో అనుశాసన పర్వములో పరమేశ్వరమహిమను వర్ణనము విడువబడింది. శ్రీ శంకరాచార్యులు భాష్యమువలన ఈనామములు విశేషప్రశస్తినొందినవి.స్తోత్రములు, కవచములు, అష్టకములు నిత్యపారాయణములు నిత్యపారాయణము వలన నిష్టారైసిద్ధిని చేకూర్చును గదా! వీనిని విడువక శ్రీ శాస్త్రులుగారు మూలానుసారముగా తమ ఆంధ్రీకరణమును సాగించిరి.తెలుగు కవితకు మిగుల సొంపు చేకూర్చ వివిధ రసములను, గుణాలంకారాదులను శ్రీశాస్త్రులుగారి రచనలందు పొడగాంతుము.వీరు దీనిని రెండు దశాబ్దములలోపున ముగించిరి.

బొబ్బిలి యుద్ధము నాటకమును శ్రీశాస్త్రిగారు వ్రాసిరి.ఇది రంగస్థలమున కెక్కిన దినములలో ఆంధ్ర వసుంధర పునాదులతో కదలినది.జయచంద్రుని తాళపుచెవి కనోజినుండి జారిపడి, విజయరామరాజు చేతులపడగా శత్రువున కాతడు దానినందిచెను-బొబ్బిలి రుధిరప్లావితమయినది.ఇది చాలా ఆదరణ పొందిన నాటకము. ఈగ్రంధమును శ్రీ శాస్త్రిగారు దివంగతుడైన తమ తనయుడు సుదర్శన సుధికి అంకితమొనరించిరి.ఈబాలుడు 9ఏళ్ళు అల్లారుముద్దుగా పెరిగి, మేధానిధియై దైవప్రేరణమున తలిదండ్రులను బాసి వారికి తీరని దుఃఖమును కలిగించిపోయెను. స్వరాజ్యోదయము అను గ్రంథము శాస్త్రిగారి దేసభక్తి వ్యక్తీకరించింది. ఆంధ్రాభ్యుదయము అను చరిత్రాత్మిక పద్యకావ్యములో ఆంధ్రప్రముఖుల గుణగణములను సంక్షేపముగా వివరించిరి. భగవద్గీతాంధ్రీకరణము ను శాస్త్రిగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునకు సమర్పించిరి. సంస్కృతమున డాక్టర్ రాజేంద్రప్రసాద్ జీవిత చరిత్రను వ్రాసిరి. ఇతర రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు] మొత్తం 225 గ్రంథములను శాస్త్రిగారు రచించారు.ఇందు కావ్యములు, ప్రబంధములు, నవలలు, నాటకములు, ప్రహసనములు, నిఘంటువులు, శతకములు, అష్టకములు, చంధోవ్యాకరణములు, చిత్రకవిత్వములు, బంధకవిత్వము, గర్భకవిత్వములు మొదలయినవి ఉన్నాయి.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదమొసగినది. వెనుకటి ప్రభుత్వము వీరికి మహామహోపాధ్యాయ అని వారిని కీర్తించింది.1958లో శాస్త్రిగారు ఆంధ్రాస్థాన కవియై సన్మానింపబడిరి. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవీంద్రుడు వీరి శిష్యుడు. వీరితో శాస్త్రిగారికి కొంతకాలము వైరము గడిచినను అటుపై అది సమసినది. గిడుగు రామమూర్తి తోకూడా అదేవైఖరి నడిచినను అటుపై సఖ్యులుగా ఆత్మీయులుగా నడుచుకొనిరి.కవిసార్వభౌముడు తపస్వి. బాల నారధించిన కవీంద్రుడు.

పదబంధ నేర్పరి శ్రీపాద వారుసవరించు

గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంథాలను రాసారు. పద్యం, గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.

పత్రికా సంపాదకుడిగాసవరించు

శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయింది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.

ఇతర విశేషాలుసవరించు

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు.

ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి పూలమాల వేసి భక్త్యంజలి ఘటించేవారు.

ముఖ్యమైన రచనలుసవరించు

నాటకాలుసవరించు

 • కలభాషిణి
 • రాజభక్తి
 • భోజరాజ విజయం
 • శ్రీనాథ కవి రాజీయం

పద్య కావ్యాలుసవరించు

 • గౌతమీ మహత్యం
 • సత్యనారాయణోపాఖ్యానం
 • గజానన విజయం
 • శ్రీకృష్ణ కవి రాజీయం
 • సావిత్రీ చరిత్రం
 • వేదాద్రి మహాత్మ్యము
 • యజ్ఞవల్క్య చరిత్ర

అచ్చతెలుగు కావ్యాలుసవరించు

 • బ్రహ్మానందం
 • శాకుంతలం

వచన గ్రంథాలుసవరించు

 • సంస్కృత కవి జీవితాలు
 • కాళిదాస విలాసము
 • తెనాలి రామకృష్ణ చరిత్రము
 • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము)
 • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (రెండవ భాగము)

అనువాదాలుసవరించు

 • శ్రీకృష్ణ భారతం
 • శ్రీకృష్ణ రామాయణం
 • శ్రీకృష్ణ భాగవతం

ఇతర రచనలుసవరించు

కపిరగిర్ చరిత్రము

 • శ్రీకృష్ణస్వీయచరిత్రము
 • మార్కండేశ్వర మహత్యము (స్థల పురాణము)
 • జగద్గురు చరిత్రము ( శంకర విజయము)
 • సానందసాయుజ్యము
 • ద్వారకా తిరుమల మహత్యము (స్థల పురాణము)
 • గౌతమీ పుష్కర మహత్యము
 • కావేరీ మహత్యము
 • విజయలక్ష్మీ విలాసము
 • కామాక్షీ విజయము
 • ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవము

జీవితచరిత్రసవరించు

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు.[1] ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడింది.

బిరుదులుసవరించు

 • మహామహోపాధ్యాయ
 • కవిసార్వభౌమ
 • కవిరాజు
 • కవిబ్రహ్మ
 • ఆంధ్రవ్యాస
 • అభినవ శ్రీనాథ
 • వేద విద్యా విశారద
 • ప్రసన్న వాల్మీకి
 • కళాప్రపూర్ణ

మూలాలుసవరించు

 1. భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.