ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులు ఇచ్చాను. - అనాథ మూస.
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, కి → కి , తరవాత → తరువాత, → using AWB
పంక్తి 22:
ఫెర్మా న్యాయ విచారణా వ్యవస్థలో తీర్పరిగా కూడా కొన్నాళ్లు పని చేసేడు. ఈ విధి నిర్వహణలో ఒక మత పురోహితుడికి - తన విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదనే నేరంపై - "సజీవ దహన" (burning at the stake) శిక్ష విధించేడు కూడ.
 
ఈ రెండు ఉద్యోగాలు సుమారుగా భారత దేశంభారతదేశం లోని మునసబు-మేజిస్ట్రేటు వంటివి.
 
ఇలా సమాజపు నిచ్చెన మెట్లు ఒకటీ ఒకటీ ఎక్కుతూ చివరికి తన పేరులో డి (de) అనే పట్టపు పేరు తగిలించుకునే హక్కు కూడా సంపాదించుకున్నాడు. ఈ విజయాలన్నిటికి అతని చికీర్ష ఒక్కటే కారణం కాదు; దేశంలో ప్రజారోగ్య పరిస్థితులు కూడా కొంతవరకు దోహదం చేసేయి. ఆ రోజుల్లో ప్లేగు మహామారి ఐరోపాలో విస్తృతంగా వ్యాపించి ఎంతో మందిని పొట్టబెట్టుకుంది. ప్రభుత్వోద్యోగులు చనిపోయినప్పుడు ఆ ఖాళీలు భర్తీ చెయ్యాలి కదా. ఫెర్మా ప్లేగు వచ్చి కోలుకున్న వ్యక్తులలో ఒకడు కనుక ఖాళీ అవుతున్న ఆ పై ఉద్యోగాలలోకి జొరబడే అవకాశం ఇతనికి వచ్చింది.
పంక్తి 29:
 
==గణితంలో అభిలాష==
పదిహేడవ శతాబ్దపు మొదటి రోజులలో గణిత శాస్త్రం ఇంకా చీకటి యుగంలోనే ఉందనవచ్చు. ఆ రోజులలో గణిత శాస్త్రజ్ఞలకి పెద్దగా పరపతి ఉండేది కాదు. ఏదో అంకెలతో గారడీలు చేసే వాళ్ల కోవలో పరిగణించబడేవారు. [[గెలీలియో గెలీలి|గెలిలియో]] అంతటివాడికి పీసా విశ్వవిద్యాలయంలో గణితం చదవడానికి అవకాశం రాలేదు; ప్రయివేట్లు చెప్పించుకుని నేర్చుకున్నాడు. అంతవరకు ఎందుకు? ఐరోపా ఖండం అంతటికీ ఒక్క [[ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం]]లోనే గణితానికి ఒక శాఖ, ఒక పీఠం ఉండేవి. ఫెర్మా నివసించిన ఊరు [[పారిస్|ప్యారిస్]] కి దూరం కావడంతో ప్యారిస్ నగరంలో ఉన్న కొద్ది పాటి గణిత వేత్తలు (ఉ. పాస్కల్, మెర్సెన్) కూడా అందుబాటులో ఉండేవారు కాదు.
 
ఫెర్మా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన వారిలో ఫాదర్ మెర్సెన్ ఒకరు; ఆయన ఫ్రాన్సులో తిరుగుతూ ఫెర్మాని తరచు కలుసునేవారు. ఫెర్మా స్నేహబృందంలో మెర్సెన్ ఒకరైతే "అరిథ్మెటికా" (Arithmetica) అనే పురాతన గ్రీకు గణిత గ్రంథం మరొకటని అభివర్ణించవచ్చు. మెర్సెన్ తో ఇంత పరిచయం ఉన్నప్పటికీ మెర్సెన్ వల్ల పూర్తిగా ప్రభావితుడు కాలేదు ఫెర్మా; తన ధోరణిలో తను సిద్ధాంతాలు - ఋజువులు చూపించకుండా కాగితాల మీద రాసి వదిలేసేవాడు. "ఋజువేది?" అని అడిగితే "నా బుర్రలో ఉంది" అని సమాధానమిచ్చేవాడు. తను ఆవిష్కరించిన సిద్ధాంతాలు ప్రచురించాలి అని కాని, వాటి వల్ల తనకి పేరు ప్రతిష్ఠలు రావాలని కాని అతనికి ఉండేది కాదు. దీనికి తోడు కొంత చిలిపితనం కూడా ఉండేదేమో అప్పుడప్పుడు తన అనుయాయులని అల్లరి పెట్టే ఉద్దేశంతో సిద్ధాంతం రాసి, ఋజువు చూపించకుండా, "ఇది అవునో కాదో చెప్పుకో చూద్దాం!" అని సవాలు చేసి సమాధానం చెప్పేవాడు కాదు. రెనే డెకా అంతటివాడు ఫెర్మాని "గప్పాల గండడు" అనేవాడు.
పంక్తి 39:
కేలుక్యులస్ కీ సంభావ్య సిద్ధాంతానికీ ఫెర్మా వేసిన పునాదులకి ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోడానికి సరిపోతాయి. ఈ రెండింటితోపాటు సంఖ్యా సిద్ధాంతానికి (Number Theory) కూడా ఫెర్మా మౌలికమైన పునాదులు చేసేరు.
 
ఫెర్మాకి గణితంలో గురువంటూ ఎవ్వరూ లేరు. అతని పరిశ్రమ అంతా డయొఫాంటెస్ రాసిన అరిథ్మెటికా (Arithmetica) అనే గ్రంథం చదువుకుని స్వయంకృషితో చేసినదే. ఆ గ్రంథం వెయ్యేళ్ల గణితసార సంగ్రహం. [[పైథాగరస్|పైథోగరోస్]], [[యూక్లిడ్|యూకిలిడ్]] వంటి హేమాహేమీలు ఆవిష్కరించిన శాస్త్రం - ప్రత్యేకించి సంఖ్యా శాస్త్రం - అంతా ఆ గ్రంథంలో క్రోడీకరించబడి ఉంది. ఈ పుస్తకంలో "పులి-మేక-గడ్డిమేటు పడవలో నదిని దాటడం" వంటి గణిత ప్రహేళికలు వందకి పైగా కనిపిస్తాయి. ప్రతీ ప్రహేళికనీ ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించి చూపుతాడు డయొఫాంటెస్. కాని అదేమి (దుర్) అదృష్టమో కాని ఈ పుస్తకం చదివి గణితం నేర్చుకున్న ఫెర్మాకి ఈ పుస్తకం క్రమబద్ధం చేసిన మంచి అలవాటు అబ్బలేదు. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించే పద్ధతిని ఒక చిన్న కాగితం మీద ముక్తసరిగా మూడు ముక్కలలో సూచించి, దానితో కొన్నాళ్లు చెలగాటాలు ఆడి ఆ కాగితం ముక్కని చెత్త బుట్టలో పడేసేవాడు. అప్పుడప్పుడు, పక్కని కాగితం కనబడకపోతే, ఆ రాయదలుచుకున్నది ఆ పుస్తకం యొక్క ఉపాంతం ("మార్జిన్") లో గొలికేవాడు. ఇలా ఉపాంతంలో రాసిన ఆణిముత్యాలు ఎన్నో తరవాతతరువాత తరాలవారికి దొరికేయి.
 
==ఫెర్మా ఆఖరి సిద్ధాంతం==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు