జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''జగన్నాథరావు వనమాలి''' [[ఢిల్లీ]] [[ఆకాశవాణి]]లో ఒకప్పుడు [[తెలుగు]] వార్తలు చదివిన ఈయన 'కళావాచస్పతి జగ్గయ్య' సమకాలికుడు.
 
జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా [[దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డుని కూడా పొందాడు. 86 ఏళ్ల వయసులోనూ[[వయసు]]<nowiki/>లోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఉన్నాడు.
==జీవిత విశేషాలు==
బాల్యంలో ఆయన [[ఉన్నత పాఠశాల]] చదువుతున్నప్పుడు ఆయన తండ్రి పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటితో పుస్తకాలు కొనుక్కునే వారు. ముఖ్యంగా ముద్దుకృష్ణ 'వైతాళికులు' సంకలనంలో వినాయకరావు, [[రాయప్రోలు సుబ్బారావు]], [[శ్రీశ్రీ]], విశ్వనాథ, కృష్ణశాస్త్రిగార్ల కవితలు వీరికి కంఠస్థం. ఆ పుస్తకం ఎప్పుడూ చేతిలోనే ఉండేది. 1944 - 45 ప్రాంతాల్లో [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండేవారు. వీరికి [[సంగీతం]] మీద కూడా అభిలాష ఉండటంతో హాస్టల్‌లో ఉండే కుర్రాళ్లకి [[పద్యాలు]] పాడి వినిపించే వారు. సాహిత్యపరంగా[[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>పరంగా నచ్చిన పద్యాలకి, కవితలకి రాగాలు కట్టి పాడేవారు. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ '[[మహాప్రస్థానం]]' పబ్లిష్ అయింది. ఇంట్లోవారు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని ఆ పుస్తకం కొన్నారు. 'మహాప్రస్థానం'లోని కవితలన్నీ వీరికి కంఠస్థమే. ముప్పై పేజీలున్న [[చలం]] 'అమీనా' కూడా మొదట్నించి చివరిదాకా అప్పచెప్పేవారు.
 
==శ్రీశ్రీ పరిచయం==
పంక్తి 48:
 
==ఆకాశవాణిలో చేరిక==
1947 లో ఆయన [[ఆంధ్రాయూనివర్సిటీఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా యూనివర్సిటీ]]<nowiki/>లో బి.ఎ. ఆనర్స్ చేస్తున్నపుడు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్లు కావలెనని వార్తాపత్రికలో ప్రకటన చూసి అప్లయ్ చేశారి వనమాలి. [[న్యూఢిల్లీ]] లో వార్తల విభాగంలో ఉద్యోగం వచ్చింది. [[తెలుగు]]లో వార్తలు చదివేవాడు. అక్కడ [[జగ్గయ్య]] వీరి రూమ్‌మేట్. జగ్గయ్య వనమాలి కంటే సీనియర్. ఆయనకి అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉంది. అంచేత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో చేరడానికి [[చెన్నై|మద్రాసు]] వెళ్లిపోయాడు. సినిమా రంగం లోకి జగ్గయ్య ఆహ్వానించినా ఈయన వెళ్ళలేదు.
 
==ఫిల్మ్ డివిజన్‌లో ప్రవేశం==
1956లో [[ముంబై|ముంబాయి]] ఫిల్మ్స్ డివిజన్ వాళ్ల అడ్వర్టయిజ్‌మెంట్ వచ్చింది. అప్లయ్ చేస్తే ఉద్యోగం వచ్చింది. రేడియోలో రిజైన్ చేసి అక్కడ జాయిన్ అయ్యారు. గట్టిగా అరిచి చదవక్కర్లేదు, నెమ్మదిగా చదవచ్చని అనుకున్నారు. తమ వాయిస్ మేం విని తర్వాత రికార్డింగ్ చేసేవాళ్ళు. అప్పుడు వాయిస్ ఎలా బాగు చేసుకోవాలో తెలిసేది. ఆ విధంగా నా వాయిస్‌కి మెరుగులు దిద్దుకున్నారు. ఫిల్ం స డివిజన్‌లో ఎన్నో గ్రంథాలుండేవి కాని అక్కడా వాయిస్ గురించి ఒక్క [[పుస్తకము|పుస్తకం]] కన్పించలేదు. ఫిల్మ్ సబ్ డివిజన్‌లో పని ఎక్కువగా ఉండేది. నెమ్మదిగా కమర్షియల్ రంగం మొదలయింది. 'ఒన్ మినిట్ యాడ్స్', డాక్యుమెంటరీ ఫిలింలు వచ్చాయి. 1960 వరకూ ఫిల్మ్స్ డివిజన్‌లోనే ఉన్నాను.
 
==వాయిస్ శిక్షణ ఇచ్చేవారు==
ఫిల్మ్ సబ్ డివిజన్‌లో ఉండగానే ఒకరోజు దుర్గాఖోటేగారు వచ్చి 'ఎన్నాళ్లు ఇక్కడ ఉంటావు? బయటికి వచ్చేయి మన్నారు వీరిని. వాయిస్‌లో శిక్షణ లేక చాలామంది ఎదురు చూస్తున్నారు వీరు. నువ్వు ఆర్గనైజ్ చేయగలవు' అని ధైర్యం చెప్పారు. ఆవిడకు 'దుర్గాఖోటే ప్రొడక్షన్స్' అని సంస్థ ఉండేది. ఆవిడ మాట ప్రకారం బయటకి వచ్చి కొద్దిమంది మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇలా వాయిస్ [[శిక్షణ]] ఇచ్చేవారెవరూ లేరు. పిచ్ అంటే ఏమిటి? వాల్యూమ్ అంటే ఏమిటి? పాజ్ ఎప్పుడు ఇవ్వాలి? మాడ్యులేషన్, డబ్బింగ్ అంటే ఏమిటి? ఇలా ఎన్నో విషయాల మీద శిక్షణ ఇచ్చేవారు. అక్కడికి వచ్చేవాళ్లు ఉద్యోగస్తులు. సాయంత్రాలు క్లాసులకు వచ్చేవారు. అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తిరగటం, వాళ్లు సరిగా డబ్బులు ఇవ్వక పోవటంతో దానితోనూ విసిగిపోయారు.
 
==అమెరికాలో శిక్షణ ==
1980లో ఆయన అమ్మాయి కోసం [[అమెరికా]] వెళ్లినప్పుడు బ్రాడ్‌వేలో ఒక నాటకం చూడ్డం జరిగింది. అక్కడ వాయిస్‌కి ట్రైనింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ రోడ్డు రోడ్డంతా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే వర్క్‌షాప్స్ ఉండేవి. వారం ఉందామని అనుకున్న వారు నాలుగైదు వారాలు ఉండి నేను కూడా ట్రైనింగ్ అయ్యారు. అది వారికి కనువిప్పు. ఆయన చేస్తున్న పని, ఇన్ని రోజులు ఆయన ఆచరిస్తున్న విధానం ఎంత తప్పో తెలిసింది. అప్పుడు ఆయనకు మళ్లీ ఇంట్రస్ట్ కలిగింది. ముఖ్యంగా అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆవిడ లండన్‌లో ట్రైనింగ్ అయింది. 'ఐరిష్ వారెన్' ఆమె పేరు. [[లండన్‌]]లో డ్రామాకి, ఫిల్మ్స్‌కి, రేడియోకి[[రేడియో]]<nowiki/>కి వాయిస్‌లో ట్రైనింగ్ అయింది. అమెరికాలో వాయిస్ ట్రైనింగ్ ఇచ్చేది. అనుకోకుండా వాయిస్ మీద ఒక పుస్తకం కూడా అక్కడ దొరికింది వారికి.
 
=='వర్డ్స్ అండ్ వాయిసెస్' ప్రారంభం==
కొంతమందితో కలిసి మళ్లీ బొంబాయిలో (1991) 'వర్డ్స్ అండ్ వాయిసెస్' సంస్థని స్థాపించారు. ట్రైనింగ్‌లో భాగంగా పిచ్, వాల్యూమ్, మాడ్యులేషన్, కార్డ్ మొదలైన విషయాలెన్నో ఉంటాయి. ఒక్క తెలుగులోనే కాదు. [[హిందీ]], [[మరాఠీ]], [[మలయాళం]], [[రష్యన్]], [[ఇంగ్లీష్]] ఇంకా ఎన్నో భారతీయ భాషల్లో ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక్కడికి యాక్టర్లే కాదు లాయర్లు కూడా వస్తుంటారు. అప్పుడే పుట్టిన పాపాయికి ఏ భాషా రాకపోయినా గాలి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి శబ్దంగా బయటికి వస్తుంది. ఏడవటం మొదలుపెడుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా శ్వాస ద్వారా జరిగే ప్రక్రియ. మన స్వరం ఒక సంగీత వాయిద్యం వంటిది. వయోలిన్, వీణలని శృతి చేస్తే ఎన్నో రాగాలు పలికించవచ్చు. అలాగే మన గళం నుండి కూడా ఎన్నో భావాలు పలికించవచ్చు. ఆయన దగ్గర తర్ఫీదు పొందినవారు సినీ, డబ్బింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల్లో ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా మొదట్లో నా దగ్గర తర్ఫీదు పొందినవారే.
 
ఆయన జీవితాన్ని వాయిస్‌కే అంకితం చేశారు. తొలి రోజుల్లో 'తెలుగు స్వతంత్ర'లో కొన్ని వ్యాసాలు, కథలు రాశారు. ఒక పుస్తకం కూడా వెలువడింది. ఆంగ్లంలో ఎన్నో స్క్రిప్ట్స్ రాశాను. ఫిల్మ్స డివిజన్‌లో ఉన్నప్పుడు తరచుగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేసేవారు. ట్రెక్కింగ్ ఆయన ఇతర హాబీ. హిమాలయాలలో పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పదివేల అడుగుల ఎత్తు వరకు వెళుతుండేవారు. నేటికీ ఈ అలవాటు కొనసాగిస్తున్నారు. ఇటీవలే [[భూటాన్‌]]లో కూడా పర్వతారోహణ చేశారు. ఫోటోగ్రఫీ ఆయన మరో హాబీ.పెరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ... టీవీ ఛానల్స్ ... ఈ రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలున్నాయి. అవసరమైన ఆర్టిస్టులందరికి మా 'వర్డ్ ్స అండ్ వాయిసెస్ ఇన్‌స్టిట్యూట్' ద్వారా మంచి శిక్షణను[[శిక్షణ]]<nowiki/>ను ఆయన ఊపిరి ఉన్నంతవరకూ ఇవ్వాలనేదే వారి ఆకాంక్ష.
==మూలాలు==
* మణినాథ్ కోపల్లె(Andhrajyothi news paper)
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు