జగన్నాథరావు వనమాలి ఢిల్లీ ఆకాశవాణిలో ఒకప్పుడు తెలుగు వార్తలు చదివిన ఈయన 'కళావాచస్పతి జగ్గయ్య' సమకాలికుడు.

జగన్నాథరావు వనమాలి
జగన్నాథరావు వనమాలి
జననంజగన్నాథరావు వనమాలి
ఇతర పేర్లుజె.ఆర్.వనమాలి

జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా, ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందాడు. 86 ఏళ్ల వయసులోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఉన్నాడు.

జీవిత విశేషాలు

మార్చు

బాల్యంలో ఆయన ఉన్నత పాఠశాల చదువుతున్నప్పుడు ఆయన తండ్రి పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటితో పుస్తకాలు కొనుక్కునే వారు. ముఖ్యంగా ముద్దుకృష్ణ 'వైతాళికులు' సంకలనంలో వినాయకరావు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, విశ్వనాథ, కృష్ణశాస్త్రిగార్ల కవితలు వీరికి కంఠస్థం. ఆ పుస్తకం ఎప్పుడూ చేతిలోనే ఉండేది. 1944 - 45 ప్రాంతాల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండేవారు. వీరికి సంగీతం మీద కూడా అభిలాష ఉండటంతో హాస్టల్‌లో ఉండే కుర్రాళ్లకి పద్యాలు పాడి వినిపించే వారు. సాహిత్యపరంగా నచ్చిన పద్యాలకి, కవితలకి రాగాలు కట్టి పాడేవారు. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పబ్లిష్ అయింది. ఇంట్లోవారు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని ఆ పుస్తకం కొన్నారు. 'మహాప్రస్థానం'లోని కవితలన్నీ వీరికి కంఠస్థమే. ముప్పై పేజీలున్న చలం 'అమీనా' కూడా మొదట్నించి చివరిదాకా అప్పచెప్పేవారు.

శ్రీశ్రీ పరిచయం

మార్చు

ఆ రోజుల్లో శ్రీశ్రీ రాజమండ్రి ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, ఆయన రాసిన కవితల్ని, పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. వీరికి 16 ఏళ్లు. ఒకరోజు ఆయన హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చారు వీరు. అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని వీరికి తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ చెప్పు?' అన్నారు.

'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి గోదావరి స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు.

ఆకాశవాణిలో చేరిక

మార్చు

1947 లో ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎ. ఆనర్స్ చేస్తున్నపుడు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్లు కావలెనని వార్తాపత్రికలో ప్రకటన చూసి అప్లయ్ చేశారి వనమాలి. న్యూఢిల్లీలో వార్తల విభాగంలో ఉద్యోగం వచ్చింది. తెలుగులో వార్తలు చదివేవాడు. అక్కడ జగ్గయ్య వీరి రూమ్‌మేట్. జగ్గయ్య వనమాలి కంటే సీనియర్. ఆయనకి అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉంది. అంచేత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో చేరడానికి మద్రాసు వెళ్లిపోయాడు. సినిమా రంగం లోకి జగ్గయ్య ఆహ్వానించినా ఈయన వెళ్ళలేదు.

ఫిల్మ్ డివిజన్‌లో ప్రవేశం

మార్చు

1956లో ముంబాయి ఫిల్మ్స్ డివిజన్ వాళ్ల అడ్వర్టయిజ్‌మెంట్ వచ్చింది. అప్లయ్ చేస్తే ఉద్యోగం వచ్చింది. రేడియోలో రిజైన్ చేసి అక్కడ జాయిన్ అయ్యారు. గట్టిగా అరిచి చదవక్కర్లేదు, నెమ్మదిగా చదవచ్చని అనుకున్నారు. తమ వాయిస్ మేం విని తర్వాత రికార్డింగ్ చేసేవాళ్ళు. అప్పుడు వాయిస్ ఎలా బాగు చేసుకోవాలో తెలిసేది. ఆ విధంగా నా వాయిస్‌కి మెరుగులు దిద్దుకున్నారు. ఫిల్ం స డివిజన్‌లో ఎన్నో గ్రంథాలుండేవి కాని అక్కడా వాయిస్ గురించి ఒక్క పుస్తకం కన్పించలేదు. ఫిల్మ్ సబ్ డివిజన్‌లో పని ఎక్కువగా ఉండేది. నెమ్మదిగా కమర్షియల్ రంగం మొదలయింది. 'ఒన్ మినిట్ యాడ్స్', డాక్యుమెంటరీ ఫిలింలు వచ్చాయి. 1960 వరకూ ఫిల్మ్స్ డివిజన్‌లోనే ఉన్నాను.

వాయిస్ శిక్షణ ఇచ్చేవారు

మార్చు

ఫిల్మ్ సబ్ డివిజన్‌లో ఉండగానే ఒకరోజు దుర్గాఖోటేగారు వచ్చి 'ఎన్నాళ్లు ఇక్కడ ఉంటావు? బయటికి వచ్చేయి మన్నారు వీరిని. వాయిస్‌లో శిక్షణ లేక చాలామంది ఎదురు చూస్తున్నారు వీరు. నువ్వు ఆర్గనైజ్ చేయగలవు' అని ధైర్యం చెప్పారు. ఆవిడకు 'దుర్గాఖోటే ప్రొడక్షన్స్' అని సంస్థ ఉండేది. ఆవిడ మాట ప్రకారం బయటకి వచ్చి కొద్దిమంది మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇలా వాయిస్ శిక్షణ ఇచ్చేవారెవరూ లేరు. పిచ్ అంటే ఏమిటి? వాల్యూమ్ అంటే ఏమిటి? పాజ్ ఎప్పుడు ఇవ్వాలి? మాడ్యులేషన్, డబ్బింగ్ అంటే ఏమిటి? ఇలా ఎన్నో విషయాల మీద శిక్షణ ఇచ్చేవారు. అక్కడికి వచ్చేవాళ్లు ఉద్యోగస్తులు. సాయంత్రాలు క్లాసులకు వచ్చేవారు. అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తిరగటం, వాళ్లు సరిగా డబ్బులు ఇవ్వక పోవటంతో దానితోనూ విసిగిపోయారు.

అమెరికాలో శిక్షణ

మార్చు

1980లో ఆయన అమ్మాయి కోసం అమెరికా వెళ్లినప్పుడు బ్రాడ్‌వేలో ఒక నాటకం చూడ్డం జరిగింది. అక్కడ వాయిస్‌కి ట్రైనింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ రోడ్డు రోడ్డంతా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే వర్క్‌షాప్స్ ఉండేవి. వారం ఉందామని అనుకున్న వారు నాలుగైదు వారాలు ఉండి నేను కూడా ట్రైనింగ్ అయ్యారు. అది వారికి కనువిప్పు. ఆయన చేస్తున్న పని, ఇన్ని రోజులు ఆయన ఆచరిస్తున్న విధానం ఎంత తప్పో తెలిసింది. అప్పుడు ఆయనకు మళ్లీ ఇంట్రస్ట్ కలిగింది. ముఖ్యంగా అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆవిడ లండన్‌లో ట్రైనింగ్ అయింది. 'ఐరిష్ వారెన్' ఆమె పేరు. లండన్‌లో డ్రామాకి, ఫిల్మ్స్‌కి, రేడియోకి వాయిస్‌లో ట్రైనింగ్ అయింది. అమెరికాలో వాయిస్ ట్రైనింగ్ ఇచ్చేది. అనుకోకుండా వాయిస్ మీద ఒక పుస్తకం కూడా అక్కడ దొరికింది వారికి.

'వర్డ్స్ అండ్ వాయిసెస్' ప్రారంభం

మార్చు

కొంతమందితో కలిసి మళ్లీ బొంబాయిలో (1991) 'వర్డ్స్ అండ్ వాయిసెస్' సంస్థని స్థాపించారు. ట్రైనింగ్‌లో భాగంగా పిచ్, వాల్యూమ్, మాడ్యులేషన్, కార్డ్ మొదలైన విషయాలెన్నో ఉంటాయి. ఒక్క తెలుగులోనే కాదు. హిందీ, మరాఠీ, మలయాళం, రష్యన్, ఇంగ్లీష్ ఇంకా ఎన్నో భారతీయ భాషల్లో ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక్కడికి యాక్టర్లే కాదు లాయర్లు కూడా వస్తుంటారు. అప్పుడే పుట్టిన పాపాయికి ఏ భాషా రాకపోయినా గాలి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి శబ్దంగా బయటికి వస్తుంది. ఏడవటం మొదలుపెడుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా శ్వాస ద్వారా జరిగే ప్రక్రియ. మన స్వరం ఒక సంగీత వాయిద్యం వంటిది. వయోలిన్, వీణలని శృతి చేస్తే ఎన్నో రాగాలు పలికించవచ్చు. అలాగే మన గళం నుండి కూడా ఎన్నో భావాలు పలికించవచ్చు. ఆయన దగ్గర తర్ఫీదు పొందినవారు సినీ, డబ్బింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల్లో ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా మొదట్లో నా దగ్గర తర్ఫీదు పొందినవారే.

ఆయన జీవితాన్ని వాయిస్‌కే అంకితం చేశారు. తొలి రోజుల్లో 'తెలుగు స్వతంత్ర'లో కొన్ని వ్యాసాలు, కథలు రాశారు. ఒక పుస్తకం కూడా వెలువడింది. ఆంగ్లంలో ఎన్నో స్క్రిప్ట్స్ రాశాను. ఫిల్మ్స డివిజన్‌లో ఉన్నప్పుడు తరచుగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేసేవారు. ట్రెక్కింగ్ ఆయన ఇతర హాబీ. హిమాలయాలలో పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పదివేల అడుగుల ఎత్తు వరకు వెళుతుండేవారు. నేటికీ ఈ అలవాటు కొనసాగిస్తున్నారు. ఇటీవలే భూటాన్‌లో కూడా పర్వతారోహణ చేశారు. ఫోటోగ్రఫీ ఆయన మరో హాబీ.పెరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ... టీవీ ఛానల్స్ ... ఈ రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలున్నాయి. అవసరమైన ఆర్టిస్టులందరికి మా 'వర్డ్ ్స అండ్ వాయిసెస్ ఇన్‌స్టిట్యూట్' ద్వారా మంచి శిక్షణను ఆయన ఊపిరి ఉన్నంతవరకూ ఇవ్వాలనేదే వారి ఆకాంక్ష.

మూలాలు

మార్చు
  • మణినాథ్ కోపల్లె (Andhrajyothi news paper)