ఉప్పులూరి సంజీవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 35:
}}
 
'''ఉప్పులూరి సంజీవరావు''' 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు.<ref>[http://www.cinegoer.net/telugucinema8.htm?ModPagespeed=noscript History Of Birth And Growth Of Telugu Cinema (Part 8) - cinigoer.com]</ref>
 
== జననం ==
ఉప్పులూరి సంజీవరావు [[కృష్ణాజిల్లా]] [[పామర్రు]] లో 1889 జూన్ లో జన్మించాడు.
 
== రంగస్థల ప్రస్థానం ==
సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే [[మచిలీపట్నం|బందరు]] బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు. నటుడు, [[మైలవరం]] బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన సంజీవరావు శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది.
 
సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు [[కీర్తి]] నలుదిశలకు వ్యాపించింది. [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-18063 నాటక భిక్షపెట్టిన మైలవరం రాజా! - ఆంధ్రప్రభ - 31 జూలై 2009]</ref> ఈయన నటించిన సావిత్రి, [[ద్రౌపది]] పాత్రలు చూడడానికి దూరప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో ‘‘పోవుచున్నాడె నా విభుని ప్రాణంబులు గొని’’ అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది.