ఉప్పులూరి సంజీవరావు

ఉప్పులూరి సంజీవరావు 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు.[1][2]

ఉప్పులూరి సంజీవరావు
ఉప్పులూరి సంజీవరావు
జననంజూన్, 1889
పామర్రు, కృష్ణాజిల్లా
మరణంసెప్టెంబర్ 11, 1957
ఇతర పేర్లుసావిత్రి సంజీవరావు
ప్రసిద్ధిరంగస్థల నటుడు, గాయకుడు

జననం మార్చు

ఉప్పులూరి సంజీవరావు కృష్ణాజిల్లా పామర్రులో 1889 జూన్ లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే బందరు బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు. నటుడు, మైలవరం బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన సంజీవరావు శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది.

సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు కీర్తి నలుదిశలకు వ్యాపించింది. మైలవరం రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు.[3] ఈయన నటించిన సావిత్రి, ద్రౌపది పాత్రలు చూడడానికి దూరప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో ‘‘పోవుచున్నాడె నా విభుని ప్రాణంబులు గొని’’ అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది.

నటించిన పాత్రలు మార్చు

సావిత్రి, ద్రౌపది, శకుంతల, కైక, ఊర్వశి, సత్యభామ, మల్లమ్మదేవి, చిత్రాంగి, మోహిని, దమయంతి, లీలావతి, సీత, చంద్రమతి, చింతామణి.

బిరుదులు మార్చు

అపర సావిత్రి, రంగరత్న, రంగరాజహంస.

మరణం మార్చు

1957, సెప్టెంబర్ 11న విజయవాడలో స్వర్గస్థులయ్యారు.

మూలాలు మార్చు

  1. ఉప్పులూరి సంజీవరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 613.
  2. "History Of Birth And Growth Of Telugu Cinema (Part 8) - cinigoer.com". Archived from the original on 2016-03-05. Retrieved 2013-07-21.
  3. నాటక భిక్షపెట్టిన మైలవరం రాజా! - ఆంధ్రప్రభ - 31 జూలై 2009[permanent dead link]