మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==వివాదాలు==
మాలపిల్ల సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణుల మీదనే కేంద్రీకరించి తీశారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం నియమించగా పండ్రంగి కేశవరావు అనే ప్రముఖుడు సినిమాను సమీక్షించి సినిమాకు అననుకూలమైన నివేదిక సంఘానికి సమర్పించాడు. <ref name="ఆంధ్రపత్రిక సంఘ సంస్కారమా? సంఘ విద్వేషమా?">{{cite news|last1=ఆంధ్రపత్రిక|first1=విలేకరి|title=సంఘ సంస్కరణమా? సంఘ విద్వేషమా?|work=ఆంధ్రపత్రిక|date=30 September 1938}}</ref>బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.<ref name="ఆంధ్రపత్రిక నింద్యమైన భాగాలు తీసివేయాలి">{{cite news|last1=ఆంధ్రపత్రిక|first1=విలేకరి|title=నింద్యమైన భాగాలు తీసివేయాలి|work=ఆంధ్రపత్రిక|date=30 September 1938}}</ref> కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దాంతో పట్టణాల మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని ప్రయత్నాలు చేశాయి. అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.
 
బ్రాహ్మణులకు సినిమాపై ఉన్న ఆగ్రహాన్ని పెంచుతూ సినిమా బృందం "పిలక బ్రాహ్మణులకు ఫ్రీ పాసులు" అంటూ కరపత్రాలు ప్రచురించారు. బి.నరసింహారావు అనే వ్యక్తి సినిమాను సమర్థిస్తూ రాశాడు. కొన్ని గ్రామాల్లో బ్రాహ్మణులు మంచినీటి చెరువుకు వెళ్ళి నీరు తెచ్చుకోనియ్యకపోవడంతో కలకలం రేగింది. జరిగిన వాదోపవాదాలు, వివాదాలు అన్నీ చివరకు చిత్రంపై ఆసక్తి పెంచేందుకే పనికి వచ్చి ఘన విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు