బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''బూర్గుల రామకృష్ణారావు''' ([[మార్చి 13]], [[1899]] - [[సెప్టెంబర్ 14]], [[1967]]) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
రామకృష్ణరావు [[1899]] [[మార్చి 13]] న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు [[కల్వకుర్తి]] దగ్గరలోని [[పడకల్]] గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం [[బూర్గుల్|బూర్గుల]]; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్)లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. [[పూణె]] లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. [[బొంబాయి విశ్వవిద్యాలయం]] నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, [[హైదరాబాద్‌]]లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర [[పివినరసింహారావు]] జూనియర్ లాయర్‌గా పనిచేశాడు.
 
== రాజకీయ జీవితం ==