మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
1930ల్లో సంగీత భరితమైన సినిమాల పద్ధతిని అనుసరించి మాలపిల్ల సినిమాలో 17 పాటలు, 12 వరకూ పద్యాలు ఉంటాయి. సాంఘిక సమస్యలపై, ప్రణయ ఇతివృత్తంపై ప్రముఖ భావకవి [[బసవరాజు అప్పారావు]] అంతకుముందే రాయగా, ప్రజాదరణ పొందిన పలు గీతాలను సినిమా కోసం తీసుకున్నారు. "కొల్లాయి గట్టితేనేమి", "నల్లవాడేనే గొల్లవాడేనే", "ఆ మబ్బు ఈ మబ్బు" వంటివి ఆ పాటల్లో ఉన్నాయి. ఒక సందర్భానికి [[జయదేవుడు|జయదేవుని]] [[అష్టపదులు|అష్టపదుల]] నుంచి "సావిరహే తవ దీనా రాధా" గీతాన్ని తీసుకున్నారు. మిగిలిన సందర్భాలకు తాపీ ధర్మారావు నాయుడు రాశారు. ఈ సినిమాకి [[భీమవరపు నరసింహారావు]] సంగీత దర్శకత్వం వహించారు.<ref name="నవ్యలో వ్యాసం" />
===పాటలు===
#మనుజుల విభజన మేలా - పి. సూరిబాబు - రచన: [[బసవరాజు అప్పారావు]]
#లేరా లేరా నిదుర మానరా - పి. సూరిబాబు బృందం - రచన: బసవరాజు అప్పారావు
#కొల్లాయి కట్టితేయేమి మా గాంధి - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు
#ఏలా ఈ బ్రతుకేలా - కాంచనమాల - రచన: బసవరాజు అప్పారావు
#నల్లవాడేనే గొల్లవాడేనే - కాంచనమాల, సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు
#వడుకు వడుకు (రాట్నం పాట) - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు
#జాతర సేతామురా దేవత - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు
#వేణు మనోహర గానము - కాంచనమాల, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు - రచన: బసవరాజు అప్పారావు
#ఆమబ్బు ఈమబ్బు ఆకాశ - కాంచనమాల, ఎస్. రాజేశ్వర రావు - రచన: బసవరాజు అప్పారావు
#సావిరహే తవదీనా - గాలి వెంకటేశ్వరరావు - జయదేవ కవి
#మాలలు మాత్రం మనుజులు - పి. సూరిబాబు బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు
#లేవు పేరునకెన్నియో మతము - పి. సూరిబాబు - - రచన: తాపీ ధర్మారావు నాయుడు
#కూలీలందరు ఏకము కావలె - ? - రచన: తాపీ ధర్మారావు నాయుడు
#జైజై మహాదేవా పాపపరిహారా - బృంద గీతం - రచన: తాపీ ధర్మారావు నాయుడు
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు