ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 8, 2010 → 2010 మే 8, , → , using AWB
పంక్తి 23:
[[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''ముప్పవరపు వెంకయ్య నాయుడు''' [[1949]], [[జూలై 1]]న [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[నెల్లూరు]] జిల్లాలో [[చవటపాలెం]] గ్రామంలో జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. [[2002]]లో [[జానా కృష్ణమూర్తి]] తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి [[2004]], [[అక్టోబర్ 18]] వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు [[ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికైనాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత [[రాజ్యసభ]]కు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. 2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 09-05-2010</ref> 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చి, రెండు సంవత్సరాల తరువాత ప్రత్యేక హోదా చట్టంలో లేదనీ ఆన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనీ ఒకవేళ ఇచ్చినా అది రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీర్చలేదని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజనీకాన్ని ఆయన మోసం చేసారు.
==బాల్యం విద్యాభ్యాసం==
[[1942]], [[జూలై 1]] న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల]] నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డాడు.<ref>http://www.bjp.org/leader/July%200102a.htm</ref> ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల కొరకు మరియు రైతుకుటుంబాలకొరకు అతడు కృషిచేశాడు. రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు [[భారత అత్యవసర పరిస్థితికిస్థితి|అత్యవసర పరిస్థితి]]కి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నాడు. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినాడు.
 
==రాజకీయ జీవితం==
[[1973]]-[[1974|74]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. [[1977]] నుంచి [[1980]] వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో [[1978]]లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభకు ఎన్నికైనాడు. [[1980]] నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. [[1983]]లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై [[1985]] వరకు కొనసాగినాడు. [[1980]]లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. [[1985]]లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి [[1988]] వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1993]]నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. [[1998]]లో రాజ్యసభకు ఎన్నుకోబడినాడు. [[2000]]లో [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసాడు. [[2002]] [[జూలై 1]] నుంచి [[2004]], [[అక్టోబర్ 5]] వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిలో సేవలందించి [[మహారాష్ట్ర]] ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు.<ref>http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp</ref> [[2005]] [[ఏప్రిల్]]లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షపదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.