ప్రధాన మెనూను తెరువు

ముప్పవరపు వెంకయ్య నాయుడు

ఇండియన్ పొలిటిషన్

భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. ముహమ్మద్ హమీద్ అన్సారి తరువాత ఆగస్టు 11, 2017 న ప్రమాణ స్వీకారం చేశారు.

ముప్పవరపు వెంకయ్య నాయుడు
ముప్పవరపు వెంకయ్య నాయుడు


భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
11 ఆగస్టు 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు ముహమ్మద్ హమీద్ అన్సారి

మాజీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి మంత్రి
పదవీ కాలము
26 మే 2014 – 17 జులై 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు కమల్ నాథ్

పట్టణ పేదరిక నిర్మూలన శాఖా మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు గిరిజా వ్యాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-01) 1949 జూలై 1 (వయస్సు: 70  సంవత్సరాలు)
చవటపాలెం , నెల్లూVరు, మద్రాసు రాష్ట్రము
(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్), భారతదేశం
జీవిత భాగస్వామి ఉష
సంతానము హర్షవర్ధన్, దీపా వెంకట్
నివాసము ఢిల్లీ
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం
మతం హిందూ

బాల్యం విద్యాభ్యాసంసవరించు

1942, జూలై 1నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డాడు.[1] ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల కొరకు మరియు రైతు కుటుంబాల కొరకు అతడు కృషిచేశాడు. రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినాడు.

జీవిత విశేషాలుసవరించు

2002లో జానా కృష్ణమూర్తి తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి 2004, అక్టోబర్ 18 వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. 2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు..

రాజకీయ జీవితంసవరించు

1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనాడు. 1980 నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగినాడు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1985లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1993నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 1998లో రాజ్యసభకు ఎన్నుకోబడినాడు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసాడు. 2002 జూలై 1 నుంచి 2004, అక్టోబర్ 5 వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిలో సేవలందించి మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు.[2] 2005 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజకీయాలకు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతి గా నామినేషన్ దాఖలు చేసాడు.

ప్రమాదాలుసవరించు

రెండు సార్లు వెంకయ్యనాయుడికి తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పాయి. 2005, జనవరి 29న బీహార్ లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు అతని హెలికాప్టర్ కు నిప్పంటించారు. అప్పడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నాడు. వెంటనే తేరుకొని తప్పించుకున్నాడు. మరోసారి 2007, జూలై 15న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో విమానాశ్రయం సమీపంలో అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందికి దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

1971, ఏప్రిల్ 14న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమార్తె దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.[3] ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు.

వ్యాఖ్యలుసవరించు

ఉపరాష్ట్రపతిసవరించు

దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.

మూలాల జాబితాసవరించు

  1. http://www.bjp.org/leader/July%200102a.htm
  2. http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp
  3. "Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh". https://www.deccanchronicle.com/. 2017-07-18. Retrieved 2018-01-28. External link in |work= (help)
  4. BJP promises to extend special status to Seemandhra for 10 yrs
  5. http://www.ndtv.com/andhra-pradesh-news/special-status-will-not-solve-problems-of-andhra-pradesh-venkaiah-naidu-1225751

బయటి లింకులుసవరించు