వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎వేంగి చాళుక్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, ) → ) using AWB
పంక్తి 148:
క్రమంగా తూర్పు చాళుక్యుల రాజ్యం దక్షిణాన నెల్లూరు నుండి ఉత్తరాన శ్రీకాకుళం వరకు విస్తరించింది. తరువాతి మూడు శతాబ్దాలలో వారికి రాష్ట్రకూటులతోను, దక్షిణాన పల్లవులతోను, బోయ నాయకులతోను, చోళులతోను, పరామారులతోను ఎడతెరగని పోరులు జరిగాయి. ఒక దశలో పశ్చిమ చాళుక్య రాజు సత్యాశ్రయుడు తిరిగి చాళుక్య దేశాన్ని ఒక పాలన క్రిందికి తీసికొనిరావాలని ప్రయత్నించాడు కాని అది సాధ్యం కాలేదు.
 
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధృవుడుధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.
 
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి యుద్ధంలో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు