హరి ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → using AWB
పంక్తి 41:
 
== ఉద్యోగం ==
రైల్వే, [[తంతి|టెలిగ్రాఫ్]] శాఖలలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ [[గుంటూరు]] లో స్థిరపడ్డారు. ప్రసాదరావు సతీమణి సీతమ్మ చిన్న వయసులో మరణించినా పునర్వివాహం చేసుకోకుండా నాటక రంగానికే జీవితాన్ని అంకితం చేశారు.
 
== నాటక ప్రస్థానం ==
వచన నాటకాలలో నటిస్తున్న హరిప్రసాదరావు [[బళ్లారి]] కేంద్రంగా వీరవిహారం చేస్తున్న పద్య వైభవాన్ని గురించి తెలుసుకొని అక్కడకు వెళ్లారు. బళ్లారిలో [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] చిత్రనళీయం నాటకాన్ని చూసి ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన తిరస్కరించారు. బళ్లారిలో ఒక నాటకాన్ని ప్రదర్శించి ధర్మవరం వారిని మెప్పించి [[చిత్రనళీయం|చిత్రనళీయ]] నాటక ప్రదర్శనకు అనుమతిని పొందారు. భావస్ఫోరకంగా; సర్వజన సుబోధకంగా, రాగాన్ని పద్యంలోనే ఇమిడ్చి పద్యంతోపాటు రాగం ముసిగేవిధంగా నూతన సంప్రదాయానికి హరిప్రసాదరావు శ్రీకారం చుట్టారు.
 
బంకుమల్లి వీరవెంకయ్య ‘సత్యహరిశ్చంద్ర’, [[వడ్డాది సుబ్బారాయుడు]] ‘వేణీ సంహారం’, [[కందుకూరి]] ‘శాకుంతలం’, [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] ‘చిత్రనళీయం’, ‘సారంగధర’, [[కోలాచలం శ్రీనివాసరావు]] ‘సునందినీ పరిణయం’, వంగిపురం రామకృష్ణమాచార్యులు ‘జనకు జనానందం’, [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]] కవి ‘హరిశ్చంద్ర’; బుద్ధిమతీ విలాసం నాటకాలతోపాటు సుంకరి కాండడు, మొద్దబ్బాయి, [[భామా కలాపం|భామాకలాపం]], బోరుూ వంటి ప్రహసనాలను అద్భుతంగా ప్రదర్శించారు. హరిప్రసాదరావు ఎన్ని పాత్రలను పోషించినా హరిశ్చంద్రుడు, సారంగధరుడు, నలుడు, [[దుర్యోధనుడు]] వంటి పాత్రలను అద్భుతంగా పోషించారు. ఆనందభైరవి, భైరవి, ముఖారి, మోహన, బారువ, పున్నాగ, శహానీ, శ్రీ, పూరీ కళ్యాణి, ఆరభి, వరాళీ రాగాలను ఆలపించడంలో ఈనాటికి హరిప్రసాదరావును అగ్రగణ్యులుగా పేర్కొంటారు.
"https://te.wikipedia.org/wiki/హరి_ప్రసాదరావు" నుండి వెలికితీశారు