ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిలా → శిథిలా (4), నివశిస్తూ → నివసిస్తూ (2) using AWB
పంక్తి 13:
==మహాయాన కాలం==
[[బొమ్మ:AP Amaravathi Stupam model.JPG|right|thumb|200px|అమరావతి స్థూపం నమూనా]]
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు [[నాగార్జునుడు]] మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు), ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన [[బుద్ధఘోషుడు]] 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతంలో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉంది.<ref name="Bhikku"/>
[[File:Bavikonda Mahastupa Visakhapatnam AP.jpg|thumb|200px|[[బావికొండ]] మహా స్తూపం]]
[[బొమ్మ:Guntupalli Buddist site 8.JPG|thumb|మధ్య|200px|గుంటుపల్లి స్థూపాలు]]
[[ధరణికోట]], [[విజయపురి]] వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు. ఆంధ్రదేశంలో కృష్ణాతీర వర్తకులు విదేశాలతో విరివిగా వ్యాపారం సాగించారు. తమ సంపదను బౌద్ధధర్మం ఆదరణకు విరివిగా వెచ్చించారు. ఆంధ్ర దేశంలో బౌద్ధాన్ని అధికంగా వర్తకులు మరియు సామాన్య జనం విశేషంగా ఆదరించారు. [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], [[తూర్పు చాళుక్యులు]] వంటి పాలకులు వైదిక మతావలంబులైనా గాని బౌద్ధాన్ని కూడా కొంతవరకు ఆదరించారు. వారి రాణివాస జనం చాలామంది మాత్రం బౌద్ధం పట్ల యెనలేని ప్రేమతో విశేషంగా ఆరామాలకు దానాలు చేశారు. నాగార్జునుని కాలంనుండి మహాయానం విశేషంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లింది. వజ్రయానం కూడా కొంతవరకు ఆదరింపబడినప్పటికీ అప్పటికే వైదికమతం పుంజుకోవడంతో బౌద్ధం క్షీణించసాగింది.
[[బొమ్మ:AP Chandavram BudhistChaitya Panel.JPG|right|thumb|200px|చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్థూపం నమూనా]]
 
==స్థూపాలు, చైత్యాలు==