చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== కళారంగ ప్రవేశం ==
నాలుగు సంవత్సరాల వయసులోనే కళారంగంలోకి ప్రవేశించింది. తల్లిదండ్రులతో కలిసి ఊరురా తిరిగి చిందు కళాబృందాలతో వివిధ ప్రదర్శనలు ఇచ్చేది. చిన్నతనంలోనే రంభ వంటి వేషాలు కట్టి అందరినీ ఆకట్టుకునేది. ప్రభావతీ విలాసం, సుందరకాండ, చెంచులక్ష్మీ, సుగ్రీవ విజయం మొదలైన కథలను ఎల్లమ్మ జానపద నృత్యరూపంలో ప్రదర్శించేది. సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, చెంచులక్ష్మీలాంటి స్త్రీ పాత్రలు మరియు అర్జునుడు, నరసింహుడు, వాలీ, శంకరుడు వంటి పురుష పాత్రలు ధరించేది.
 
1979లో [[నిజామాబాదు జిల్లా]] [[మునిపల్లి]] లో ఎల్లమ్మకు [[నటరాజ రామకృష్ణ]] పరిచయం జరిగింది. అదే సంవత్సరంలో జిల్లా కలెక్టరేట్‌ లో చిందు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత 1980లో అప్పటి ముఖ్యమంత్రి [[టి. అంజయ్య]] సమక్షంలో [[రవీంద్ర భారతి]] లో ఇచ్చిన ప్రదర్శన ఎల్లమ్మను కళాభిమానులకు దగ్గర చేసింది.
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు