చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
పదేళ్ళు నిండక మునుపే లోయర్ సెకండరీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. పెద్దయ్యేకొద్దీ స్వాతంత్ర్యోద్యమ తీవ్రత కూడా పెరిగింది. అందుకు [[గాంధీ]] టోపీ, ఖద్దరు ధరించాడు.
==విద్యాభ్యాసం, ఉద్యోగాలు==
ఉన్నత పాఠశాల విద్య పూర్తయ్యే సరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మైసూరు సంస్థానం మాత్రం ఇంకా మహారాజుల పాలనలో ఉండేది. దాన్ని భారత్ లో విలీనం చేయాలంటూ పోరాటం మొదలైంది. రామచంద్ర కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పదిహేడేళ్ళకే బీయెస్సీ పట్టా అందుకుని [[మైసూరు విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
 
[[మైసూరు విశ్వవిద్యాలయం]] నుంచి 1951లో, ఆయన బీ.ఎస్సీ. పూర్తి డిగ్రీ పుచ్చుకున్న తరువాత [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]]లో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని, 1958లో [[:en:Purdue University|పుర్డ్యూ యూనివర్సిటీ]]లో పి.హెచ్.డి. సాధించి [[బెంగళూరు]]లోని [[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్]]‌లో లెక్చరర్ ‌గా చేరారు. 1963లో కాన్పూర్‌ ఐఐటీలో అధ్యాపకుడిగా చేరారు.1984-1994 మధ్య కాలంలో [[బెంగళూరు]]లోని [[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్]]‌కి డైరెక్టరుగా పనిచేశాడు. [[:en:University of Oxford|ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]], [[:en:University of Cambridge|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]], [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.
 
[[:en:Solid-state chemistry|సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ]] మరియు [[:en:Materials science|మెటీరియల్ సైన్సు]] రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. [[:en:transition metal oxide|ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడు]]ల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.