దానం: కూర్పుల మధ్య తేడాలు

→‎అవయవ దానం: పార్థీవ దేహదానం 1) పార్థీవ దేహమును ఎవరు దానం చేయవచ్చు?  సహజ మరణానంతరం 6 గంII లోపు నేత...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
===[[రక్త దానం]] ===
{{main|రక్త దానం}}
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. [[చిరంజీవి]] లాంటి కొందరు [[బ్లడ్ బ్యాంకు]]లు నడుపుతున్నారు.
 
==[[అవయవ దానం]] ==
కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు:[[మోహన్ ఫౌండేషన్‌]], [[గూడూరి సీతామహాలక్ష్మి]] శరీరదానం [[పార్ధీవదేహ దానం తరచు అడుగు ప్రశ్నలు]] Ph.8008840506 పనిచేస్తున్నారు.
"మోహన్ ఫౌండేషన్" వ్యాధిగ్రస్థులకు, వైద్యులకు, ప్రజలకు మధ్య అవయవ దానం, అవయవ మార్పిడిపై అవగాహన కలిగించే స్వచంద సేవా సంస్థ .అవయావాలు అమ్మడం కొనడం నేరం, మోహన్ ఫౌండేషన్ వాలంటీర్లు అవయ మార్పిడి ఆవశ్యకత గురించి, కిడ్నీ, కాలేయం, గుండెమార్పిడుల అవయవ దానం అవసరం గురించి ప్రజల్లో అవగాన పెంచేందుకు కృషి చేస్తున్నారు, రకరకాల ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయదానంపై అవగాహన పెంచి స్వచ్ఛందంగా అవయదానానికి సహకరించాలని కోరుతున్నారు, అవయదానంచేసిన వారి బంధువులు ఆ అవయవాల వల్ల జీవంపోసుకున్న వారిని చూసి తమవారు ఇంకా బ్రతికే ఉన్నారని సంతృప్తి చెందుతున్నారు.మోహన్ ఫౌండేషన్‌[http://www.mohanfoundation.org/] హైదరాబాదు ఫోన్ నంబర్: 040 -66369369.
 
==[[అన్న దానం]]==
[[ఆకలి]]తో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. [[బుడ్డా వెంగళరెడ్డి]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 19వ శతాబ్దంలో సంభవించిన [[డొక్కల కరువు]] సమయంలో ఎన్నో వేలమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత.
 
===కన్యాదానం===
Line 29 ⟶ 28:
 
==ఆస్తి దానం==
అమెరికాలోని సంపన్నులంతా తమ ఆస్తిలో సగభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రతినబూనాల్సిందిగా బఫెట్‌, [[బిల్ గేట్స్]] పిలుపునిచ్చారు. అమెరికాలో దాదాపు 400 మంది బిలియనీర్లున్నారు. వీరంతా తమ సంపదలో అధిక భాగాన్ని దానధర్మాలకు మళ్లిస్తే- దాతృత్వ కార్యక్రమాల తీరుతెన్నులే మారిపోతాయని వ్యాఖ్యానించారు. 2006లో బఫెట్‌ తన 'బెర్క్‌షైర్‌ హాథవే' కంపెనీలోని షేర్లన్నింటినీ దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు. ''నా ఆస్తిలో 99 శాతానికి పైగా నా జీవితకాలంలోనో, నా తదనంతరమో దాతృత్వ కార్యక్రమాలకు వెళ్లిపోతుంది. ఈ డబ్బునంతా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ఖర్చుపెట్టాలనుకుంటున్నాను. ఇంత దానం చేసినా మా జీవన సరళి ఏ మాత్రం ప్రభావితం కాదు. నేనూ, నా పిల్లలూ హాయిగా జీవించేందుకు నా మొత్తం ఆస్తిలో 1% ఉంచుకుంటే చాలు. అంతకు మించి ఉంచుకోవటం వల్ల మా జీవితాల్లోగానీ, మా సుఖ సంతోషాల్లో గానీ పెద్దగా మార్పేమీ రాదు' అని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు బఫెట్‌, బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ ముగ్గురూ కలిసి.. www.givingpledge.org పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ప్రపంచంలోని 793 మంది బిలియనీర్లలో కేవలం 14 మంది మాత్రమే ఈ మాత్రం దానాలు చేసినట్టు తేలింది. కొందరైతే ఆర్భాటంగా ప్రకటనలు చేసేసి.. ఆ తర్వాత నెరవేర్చలేదనీ తేలింది.
 
==అపాత్రదానం==
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు